రేవంత్ రెడ్డి ఫ్యామిలీపై భూ దందా ఆరోపణలు...

రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు భూ దందాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

news18-telugu
Updated: February 26, 2020, 11:32 AM IST
రేవంత్ రెడ్డి ఫ్యామిలీపై భూ దందా ఆరోపణలు...
అయితే స్వామి గౌడ్ తరహాలో టీఆర్ఎస్‌లోని అసంతృప్తిగా ఉన్న నేతలను తనవైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
  • Share this:
రేవంత్ రెడ్డి ఫ్యామిలీ చుట్టూ భూ దందా ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరుడితో కలసి తప్పుడు పత్రాలతో అత్యంత ఖరీదైన భూమిని తమ పేరిట మ్యుటేషన్‌ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉండగా, అందులో 6 ఎకరాల 7 గుంటల భూమిని రేవంత్‌రెడ్డి అక్రమ మార్గంలో హస్తగతం చేసుకున్నారని నివేదిక వెల్లడించింది. గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 127లో గల భూమికి సంబంధించి తమకు హక్కు ఉందని, రేవంత్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి ఈ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఈ మేరకు సీఎస్‌కు నివేదిక సమర్పించారు. తప్పుడు పత్రాలతో తొలుత వేరే వారి పేరు మీద భూమి రాయించి, ఆ తర్వాత వారి నుంచి కొనుగోలు చేసినట్లు రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి పత్రాలు సృష్టించినట్లు తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని అక్రమంగా మ్యుటేషన్‌ చేసిన అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్‌/డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: February 26, 2020, 11:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading