హైదరాబాద్‌లో మరో యాక్సిడెంట్.. ట్రక్కు ఢీకొని మహిళ మృతి

తలపై నుంచి టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. హెల్మెట్‌తో పాటు ఆ మహిళ తల ఛిద్రమైంది. ఏఎస్‌రావు నగర్‌లోని రాధిక థియేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

news18-telugu
Updated: November 27, 2019, 5:01 PM IST
హైదరాబాద్‌లో మరో యాక్సిడెంట్.. ట్రక్కు ఢీకొని మహిళ మృతి
రాధిక థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం
  • Share this:
హైదరాబాద్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం, బంజారహిల్స్ ఆర్టీసీ బస్సు బీభత్సాన్ని మరవక ముందే.. కాప్రాలో మరో ఘోరం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు.. స్కూటీపై వెళ్తున్న మహిళను ఢీకొట్టింది. తలపై నుంచి ట్రక్కు టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. హెల్మెట్‌తో పాటు ఆ మహిళ తల ఛిద్రమైంది. ఏఎస్‌రావు నగర్‌లోని రాధిక థియేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక బుధవారం నగర వ్యాప్తంగా పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇవాళ ఉదయం ఎల్బీ నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన కారు ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటమ్మ, సత్తెమ్మ అనే ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అటు కూకట్‌పల్లిలోనూ మరో ప్రమాదం జరిగింది. లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిని లారీ ఢీకోవడంతో.. బైక్ ఉన్న వ్యక్తి చనిపోయాడు. ఇక మంగళవారం బంజారహిల్స్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చనిపోయిన విషయం తెలిసిందే.
First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>