Eetala Rajender :ఈటల రాజేందర్‌పై కార్మిక సంఘాల ఫైర్..దిష్టి బొమ్మ దగ్ధం...!

ఈటల రాజేందర్ (ఫైల్)

Eetala Rajender : కల్వకుంట్ల కవిత గారిపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ది కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు.

  • Share this:


    ఎమ్మెల్సీ కవితకు పలు కార్మిక సంఘాలను కట్టబెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. ఉద్యమకారులను కాదని కవితకు కార్మిక సంఘాల్లో నాయకత్వం అప్పగించడంపై మండిపడ్డారు..అయితే కవితపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయా సంఘాల కార్మిక నాయకులు ఈటల రాజెందర్ ను టార్గెట్ చేశారు..దీంతో పాటు ఆయన దిష్టిబోమ్మను దగ్థం చేశారు.

    ఎమ్మెల్సీ ఆర్టీసీ సహా అనేక కార్మిక సంఘాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని గౌరవ అధ్యక్షురాలిగా ఉండాలని కోరుతున్నాయని, ఎంపీగా, ఎమ్మెల్సీగా కవిత గారు పనిచేస్తున్న విధానమే ఇందుకు కారణమని వివిధ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈటల అనుచిత వ్యాఖ్యలపై సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ గౌరవాధ్యక్షురాలిగా ఉండాలని తామంతా ఎమ్మెల్సీ కవితను కోరామని, సీఎం కేసీఆర్ గారి నిర్ణయమే శిరోధార్యమని ఎమ్మెల్సీ కవిత తెలిపారన్నారు. ఆర్టీసీకి ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే తప్పేంటని, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టార్ ఆస్తులను కాపాడటానికి 15 రోజులు పాటు కవిత గారు ఢిల్లీలో దీక్ష చేసిన విషయం మీకు తెలియదా అని థామస్ రెడ్డి ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారన్న థామస్ రెడ్డి, ఇటీవలి బడ్జెట్ లో ఆర్టీసీకి రూ. 3 వేల కోట్లు కేటాయించారన్నారు.

    ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, మరి ఈటల రాజేందర్, ఏ ఆత్మగౌరవంతో బీజేపీ లోకి వెళ్తున్నారని టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీలో చేరి సింగరేణి, ఆర్టీసీ, ఎల్ ఐసీ లాంటి సంస్థలను ఈటల రాజేందర్ ఎలా కాపాడుతారని, బడుగులకు ఏ విధంగా న్యాయం చేస్తారని థామస్ రెడ్డి విమర్శించారు. బీజేపీలో చేరి కేంద్ర రవాణా బిల్లును రద్దు చేయిస్తారా.. ఆర్టీసీని కాపాడుతారా అని ఈటలను సూటిగా ప్రశ్నించారు. హుజురాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ ప్రభుత్వ ఫలాలను అందించాడు తప్ప, సొంతంగా ఏమీ చేయలేదని, రాజకీయ లబ్ది కోసం ఈటల అసత్యాలు మాట్లాడం తగదని టీఎంయూ నేతలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు గారి చొరవ వల్లే టీఎంయూ ఏర్పడిందని, టీఎంయూ ఏర్పాటులో‌ ఈటల రాజేందర్ పాత్ర లేదని నేతలు స్పష్టం చేశారు.

    మరోవైపు టీబీజీకేఎస్ నాయకులు కూడా వీరికి జత కలిశారు..ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలోనే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సింగరేణిలోని 11 రీజియన్లలో ఈటల దిష్టిబొమ్మను కార్మికులు దహనం చేశారు. కవిత గౌరవాధ్యక్షురాలు గా ఎన్నికైన తర్వాత మాత్రమే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, కార్మికులకు 60కి పైగా హక్కులను సాధించారని చెప్పారు. కారుణ్య నియామకాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా 4వేల 500 పైచిలుకు ఉద్యోగాలు, 100% పవర్ చార్జీలను రద్దు, ఉచిత ఏసీ కనెక్షన్లు ఇలా ఎన్నో హక్కులను ఎమ్మెల్సీ కవిత గారి సారథ్యంలో సాధించుకున్నామని నేతలు తెలిపారు. 2014 లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు గా కల్వకుంట్ల కవిత గారు ఉండాలని కార్మికులు పలుమార్లు కోరారని, ఆరు నెలల క్రితం కూడా టీబీజీకేఎస్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా కార్మికవర్గం మరియు కార్యకర్తలంతా కవిత గారిని గౌరవాధ్యక్షురాలు గా ఎన్నుకోవడం జరిగిందని కార్మిక సంఘం నేతలు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published: