హోమ్ /వార్తలు /తెలంగాణ /

Suryapet : గర్భిణిపై కన్నేసిన కామంధుడు...కరోనా పరీక్ష అంటూ.. అత్యాచారయత్నం ..!

Suryapet : గర్భిణిపై కన్నేసిన కామంధుడు...కరోనా పరీక్ష అంటూ.. అత్యాచారయత్నం ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Suryapet : సూర్యపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..మరి కాసేపట్లో ప్రసవించనున్న గర్భిణిపై ఓ కామంధుడు అత్యాచార యత్నం చేయబోయాడు..అయితే.. ఆ గర్భిణి అరవడంతో వెంట వచ్చిన బంధువులు కామంధుడిని చితకబాదారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి ...

సూర్యాపేట జిల్లాలో ఓ ల్యాబ్‌టెక్నిషియన్ కళ్లు మూసుకుపోయి కామంధుడిలా మారాడు. రాత్రిపూట అత్యవసరంగా కరోనా పరీక్షల కోసం వచ్చిన గర్భిణిపై అత్యచారయత్నం చేయబోయాడు.

వివరాల్లోకి వెళితే..సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలోని చిలుకూరు గ్రామానికి చెందిన మహిళ గర్భం దాల్చడంతో ఈ నెల ప్రసవం కోసం పట్టణంలోని తిరుమల ఆసుపత్రికి వెళ్లారు.

అయితే ఆపరేషన్ చేయాల్సి రావడంతో అంతకుముందు కొవిడ్ పరీక్ష చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఆసుపత్రిలోనే ఉన్న ల్యాబ్‌టెక్నిషియన్ శ్రీకాంత్ అనే కామంధుడు ఆమెను ఓ గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయబోయాడు.

ఆ మహిళ అరవడంతో వెంట వచ్చి బంధువులు శ్రీకాంత్‌ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెను మరో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

కాగా ఈ సంఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు కావడంతో ఉన్నత స్థాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసును తారుమారు చేసేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానిక మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి..అమెకు న్యాయం చేయాలని డిమాండ్
చేస్తున్నాయి. కాగా డిఎస్పీ స్థాయి అధికారి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Rape attempt, Suryapet

ఉత్తమ కథలు