ఆత్మాహుతి బాధితులకు ఎల్ రమణ పరామర్శ

news18-telugu
Updated: September 13, 2018, 1:12 AM IST
ఆత్మాహుతి బాధితులకు ఎల్ రమణ పరామర్శ
news18-telugu
Updated: September 13, 2018, 1:12 AM IST
బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం ఎమ్యెల్యే టికెట్ ను బాల్క సుమన్ కు ఇవ్వకూడదని నిరసన కారులు అగ్నితో ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన 5 మంది ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలతో గాయపడిన వీరిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కూడా కలిసి మాట్లాడారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటనలో మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.First published: September 13, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...