మౌనిక ఫ్యామిలీకి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం

తమకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేయగా.. రూ.20 లక్షలు ఇచ్చేందుకు అధికారులు ముందుకొచ్చారు.

news18-telugu
Updated: September 23, 2019, 5:16 PM IST
మౌనిక ఫ్యామిలీకి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం
అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడిన పైకప్పు
  • Share this:
హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్ పెచ్చులూడిపడి ఓ మహిళ చనిపోయిన నేపథ్యంలో ఎల్ అండ్ టీ, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం మౌనిక కుటుంబ సభ్యులతో ఎల్ అండ్ టీ అధికారులు చర్చలు జరిపారు. తమకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేయగా.. రూ.20 లక్షలు ఇచ్చేందుకు అధికారులు ముందుకొచ్చారు.

మౌనిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీనికి మౌనిక కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు సమాచారం. కాగా, ఆదివారం అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ పెచ్చులు ఊడి మౌనికపై పడ్డాయి. నేరుగా తల మీద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో హైదరాబాద్ మెట్రో పిల్లర నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ అండ్ టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>