Kushaiguda : డీ మార్ట్ వినియోగదారులరా జాగ్రత్తా.. ! ఆ డీ మార్ట్ లో కుళ్లిపోయిన ఖర్జూర పండ్లు

Kushaiguda : డీ మార్ట్ వినియోగదారులరా జాగ్రత్తా.. ! ఆ డీ మార్ట్ లో  కుళ్లిపోయిన  ఖర్జూర పండ్లు

కుళ్లిపోయిన ఖర్తూర పండ్లు

Kushaiguda : డీ మార్ట్ కదా క్వాలిటీ మెయిటైన్ చేస్తారా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కుషాయి గూడ డీ మార్ట్ లో జరిగిన ఘటన చూస్తే షాక్ అవ్వాల్సిందే.

  • Share this:
    డీ మార్ట్ కదా క్వాలిటీ మెయిటైన్ చేస్తారా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కుషాయి గూడ డీ మార్ట్ లో జరిగిన ఘటన చూస్తే షాక్ అవ్వాల్సిందే. గత నెల 30వ తేదీన మధ్యాహ్నం 1:00 సమయంలో కుషాయిగూడ శివ సాయి నగర్ కు చెందిన వినియోగదారుడు తన డెబిట్ కార్డు తో ఇంటి కిరాణా సామాను తో పాటు కిమియా డేట్స్ కంపెనీకి చెందిన 20 ప్యాకెట్ల ఖర్జూర పండ్లను కొనుగోలు చేశాడు.ఈ క్రమంలో ఈనెల 6 తేదీన వాటిని తిందామని సీల్ ఓపెన్ చూసి చూడగా.. లోపల కుళ్లిపోయిన ఖర్జూరాలు దర్శనమిచ్చాయ్. దీంతో అవాక్కయిన వినియోగదారుడు ప్యాకింగ్ తేదీని పరిశీలించగా డిసెంబర్ 2020గా ప్యాకెట్ పై ఉంది. అలాగే ఆ ప్యాకెట్ పై ఆరు మాసాల గడువు ఉన్నప్పటికీ ఖర్జూర పండ్లు పూర్తిగా కుళ్ళు పోయిన స్థితిలో దర్శనమిచ్చాయ్. ప్యాకింగ్ తేదీ కరెక్ట్ గా, ప్యాకెట్ సీల్ మంచిగా ఉన్నప్పటికీ లోపల మాత్రం పళ్ళు కూలిపోయి రావడంపై వినియోగదారుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై సంబంధిత కిమియా డేట్స్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.

    డీ మార్ట్ షాపింగ్ మాల్ లో నాణ్యత గల వస్తువులు ఉంటాయని నమ్మకంగా కొనుగోలు చేస్తే ... మోసపూరితంగా ప్యాకింగ్ డబ్బాలు విక్రయిస్తున్నారని వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. నాణ్యతా ప్రమాణాలు పాటించని క్రిమియా డేట్స్ కంపెనీ పై, మోసపూరితంగా విక్రయం చేస్తున్న కుషాయిగూడ డీమార్ట్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే కుషాయి గూడ డీ మార్ట్ షాపింగ్ మాల్ పై కొరడా ఝళిపించారు. ఆ డి మార్ట్ ను తనీఖీ చేసిన అధికారులు.. దాన్ని వెంటనే సీజ్ చేశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు