రైతుబంధు, రైతు బీమా పథకాలతో తెలంగాణ దేశంలో అగ్ర‌గామి...మంత్రి కేటీఆర్

వ్యవసాయ మంత్రిగా పని చెసిన‌ సమయంలో రైతుబందు, రైతు బీమా పథకాలతో దేశం లో ఆగ్ర‌గామిగా నిలవడం జరిగిందని చెప్పారు. బాన్సువాడ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

news18-telugu
Updated: November 30, 2019, 11:11 PM IST
రైతుబంధు, రైతు బీమా పథకాలతో తెలంగాణ దేశంలో అగ్ర‌గామి...మంత్రి కేటీఆర్
కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన బాన్సువాడ మహా నగరంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంగా బాన్సువాడను రూపోందించాల‌ని మంత్రి చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వంద కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంబొత్సవంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల శాసన సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు పలువురు పాల్గొన్నారు.. 40 కోట్లతో నిర్మించిన రోడ్లు మరియు 25 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు,7.50 కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్ బాండ్, 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని కేటీఆర్ ప్రారంభించారు.. అనంతరం జరిగిన బహిరంగ సభలో మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం తో గత శాసనసభలో లక్ష్మి పుత్రుడిగా సీఎం కేసీఆర్ ప్రశంసలు పొందారని గుర్తు చేసారు. 42 ఏండ్ల రాజకీయ జీవితం లో ఎన్నో అభివృద్ధి పనులకు ఆయన పునాది వేశారని మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారంను కొనియాడారు.. మా అందరికి మార్గదర్శకంగా వుండి అనేక సలహాలు సూచనలు చేస్తూ నేడు శాసన సభాపతి గా కొనసాగుతున్నారని చెప్పారు.

బాన్సువాడ పట్టణ జనాభా 45 వేలు అయితే అందుకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణం చేశారు.. వ్యవసాయ మంత్రిగా పని చెసిన‌ సమయం లో రైతుబందు, రైతు బీమా పథకాలతో దేశం లో ఆగ్ర‌గామిగా నిలవడం జరిగిందని చెప్పారు. బాన్సువాడ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న తమపై బాధ్యత ఉందని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>