• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • KTR TO CELEBRTE HIS BIRTHDAY WITH GIFT A SMILE HE WILL DISTRIBUTE100 SCOOTYS TO DIFFERENTLY ABLED PERSONS SK

KTR: వారికి ఉచితంగా స్కూటీలు.. మంత్రి కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్స్.. నేతల నుంచి భారీ స్పందన

మంత్రి కేటీఆర్

KTR Birthday Gifts: మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ వంతుగా వాహనాలను విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా 50 మంది దివ్యాంగులకు స్కూటీలు ఇస్తాన్నట్లు ప్రకటించారు.

  • Share this:
    జులై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కేక్ కటింగ్ నుంచి రక్త దానాల వరకు.. మొక్కల నాటడం నుంచి పేదల సాయం వరకు.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యకర్తలు, నేతలతా మంత్రి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా ఘనంగా వేడుకలు చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. ఐతే ప్రతి ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టే కేటీఆర్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన బర్త్ డే సందర్భంగా 100 మంది దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు ఇస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు. అంతేకాదు తన బర్త్ డే వేడుకల కోసం ఫ్లెక్సీలు, బొకేలు, కేక్‌ల రూపంలో డబ్బులను వృథా చేయవద్దని.. వాటిని ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి వృక్షార్చనలో భాగమై మొక్కలను నాటాలని విజ్ఞప్తి చేశారు.




    మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ వంతుగా వాహనాలను విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా 50 మంది దివ్యాంగులకు స్కూటీలు ఇస్తాన్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సారధ్యంలో పనిచేయడం తమ అదృష్టమని.. ఆయన అడుగు జాడల్లో నడుస్తామని బాల్క సుమన్ ట్వీట్ చేశారు.

    ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన వంతుగా 60 వాహనాలను ఇచ్చేందుకు ముందకొచ్చారు.

    గత ఏడాది కేటీఆర్ బర్త్ డే సంద్భంగా ఆయన 6 అంబులెన్స్‌లను ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేశారు. మంత్రి పిలుపుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చారు. 2020లో దాదాపు 100కు పైగానే అంబులెన్స్‌లను ప్రభుత్వ ఆస్పత్రులకు అందించారు. మంత్రి కేటీఆర్ పిలుపునకు ఈసారి కూడా భారీగా స్పందన వస్తోంది. చాలా మంది నేతలు, కార్యకర్తలు దివ్యాంగులకు స్కూటీలు వచ్చేందుకు ముందుకొస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: