గల్ఫ్ బాధితురాలిని ఆదుకున్న కేటీఆర్.. ఉద్యోగం ఇవ్వాలంటూ అధికారులకి ఆదేశం..

కపిల్ రోజుకి 18 గంటలపాటు లావణ్యని పనిచేయించేవాడు.. కేవలం తన ఇంట్లోనే కాకుండా తన బంధువుల ఇంట్లో కూడా పనిచేయిస్తూ తిండి కూడా పెట్టేవాడు కాదు. జీతం అడిగితే శారీరకంగా హింసలుపెట్టేవాడు.. వీటన్నింటిని భరించిన లావణ్య ఈ విషయాన్నంతా వాట్సప్‌లో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపైస్పందించిన కేటీఆర్ సంబంధిత అధికారులకి ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: June 12, 2019, 11:12 AM IST
గల్ఫ్ బాధితురాలిని ఆదుకున్న కేటీఆర్.. ఉద్యోగం ఇవ్వాలంటూ అధికారులకి ఆదేశం..
గల్ఫ్ బాధితురాలిని ఆదుకున్న కేటీఆర్
  • Share this:
గల్ఫ్‌లో ఉద్యోగం పేరిట మోసపోయానంటూ ఓ యువతి తన కష్టాలన్నింటిని వాట్సప్ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన కేటీఆర్ సంబంధిత అధికారులకు ట్వీట్ చేయడమే కాకుండా.. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంఅడవిపదిర గ్రామానికి చెందిన లావణ్య ఆరునెలలక్రితం ఉపాధి కోసమని సౌది వెళ్లింది.. అక్కడ కపిల్ అనే వ్యక్తి ఇంట్లో పనికి కుదిరింది. అయితే, కపిల్ రోజుకి 18 గంటలపాటు లావణ్యని పనిచేయించేవాడు.. కేవలం తన ఇంట్లోనే కాకుండా తన బంధువుల ఇంట్లో కూడా పనిచేయిస్తూ తిండి కూడా పెట్టేవాడు కాదు. జీతం అడిగితే శారీరకంగా హింసలుపెట్టేవాడు.. వీటన్నింటిని భరించిన లావణ్య ఈ విషయాన్నంతా వాట్సప్‌లో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపైస్పందించిన కేటీఆర్ సంబంధిత అధికారులకి ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్‌తో కదిలిన అధికారులు.. భారతప్రభుత్వం -సౌదీఎంబసీ అధికారులు కపిల్‌పై కేసు వేశారు. అయితే.. ఇందులో అధికారులునిర్లక్ష్యం వహించడంతో.. ఖతర్ దేశంలోని ఎన్ఆర్‌ఐ గ్రూప్ లావణ్యకి అండగానిలిచింది. తెలంగాణ జాగృతి సభ్యులు వికృతిరాజుగౌడ్ రూ.35 వేల ఆర్థికసాయంతో సౌదిలోని సామాజిక సేవా కార్యకర్తశివాజీ దంపతులచేయూతతో బాధితురాలు లావణ్యని ఇండియాకు తీసుకొచ్చారు. దీంతో లావణ్య కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తనకి అండగా నిలిచిన కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలుపుకున్నారు లావణ్య కుటుంబీకులు. కేవలం లావణ్యని ఆదుకోవడమే కాకుండా సిరిసిల్లలో లావణ్యకి ఉద్యోగం వచ్చేలా చూస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Published by: Amala Ravula
First published: June 12, 2019, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading