Minister KTR: మరోసారి ట్విట్టర్ లో పొరపాటు పోస్టు చేసిన మంత్రి కేటీఆర్..! అదేంటంటే..

మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేసిన ఫొటో ఇదే

Minister KTR: ఇటీవల సైదాబాద్ నిందితుడు దొరికాడు.. 24 గంటల్లో అతడి పట్టుకంటామని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. తన తప్పును తెలుసుకొని పొరపాటు జరిగిందంటూ చెప్పారు. అలాంటిదే మరొక పొరపాటు ట్వీట్ చేసినట్లు తెలసుస్తోంది. ఏపీలో పొలాల వద్ద వ్యాక్సిన్‌ వేస్తున్న ఫొటోను తెలంగాణలో వేసినట్లుగా ట్విటర్‌లో కేటీఆర్‌ పోస్ట్‌ తప్పుబడుతూ రెండింటినీ పోస్ట్‌ చేశారు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.

  • Share this:
    ఇటీవల సైదాబాద్(Saidabad) నిందితుడు దొరక్కపోయినా.. దొరికాడని.. అతడిని 24 గంటల్లో పోలీసులు పట్టుకుంటారని ట్విట్టర్ (Twitter) లో ట్వీట్ చేసి పొరపాటు జరిగిందంటూ.. తన తప్పును ఒప్పుకున్నారు కేటీఆర్ (KTR). అయితే తాజాగా మరోసారి  అటువంటి ట్వీట్ చేసి మరో సారి పొరపాటు చేశారు. ఏపీలో వైద్య సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి రైతులకు, రైతు కూలీలకు కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసి, అది తెలంగాణలో జరిగినట్లు పేర్కొన్నారు. దీనిని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇది తెలుసుకున్న నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆంగ్ల పత్రికల్లో ప్రచురితమైంది.



    మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసిన ఆ ఫొటోల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో వ్యాక్సినేషన్ కు సంబంధించిన ఫొటో అంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ తన ట్విట్టర్ ద్వారా వివరాలను వెల్లడించారు. దీనిని సెప్టెంబర్ 12 న పవన్ అనే వ్యక్తి పోస్టు చేసినట్లుగా ఠాగూర్ పేర్కొన్నారు. ‘‘కొడుకు మినిస్టర్ స్టిల్ ఇన్ అదర్ వరల్డ్’’ అంటూ ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చెప్పాల్సింది పోయి.. ప్రజలను మోసం చేసినందుకు మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

    రైల్వేస్టేషన్ వద్ద వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. వారిని ప్రేమికులు అనుకున్నారు.. కానీ ఇంతలోనే..





    దేశానికి ఆర్థిక దన్నుగా తెలంగాణ: కేటీఆర్‌
    ఇదిలా ఉండగా.. దేశానికి ఆర్థికంగా తన వంతు పాత్ర వహిస్తూ.. వెన్ను దన్నుగా నిలుస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి పత్రికలో వచ్చిన వార్తను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హ్యాడ్ లుక్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ 2020-21 నివేదికలో వెల్లడించినట్లు పేర్కొన్నారు.

    Crime News: హయత్ నగర్ లో దారుణం.. భార్య శవాన్ని దుప్పటిలో చుట్టి.. చివరకు..





    దీనిలో మొదటి స్థానంలో తమిళనాడు, రెండో స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉన్నాయని ఆ నివేదికలో వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇవన్నీ సాధ్యం అవుతున్నాయని ట్ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. దేశ తలసరి ఆదాయం కంటే కూడా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. విస్తీర్ణం పరంగా తెలంగాణ 11వ స్థానంలో ఉండగా.. జనాభాలో 12 వ స్థానంలో ఉందంటూ ఆ ఆర్టికల్ లో ప్రచురించారు.
    Published by:Veera Babu
    First published: