HOME »NEWS »TELANGANA »ktr personally calls trs leaders says not to talk about his political future ak

KTR as CM: ముఖ్యమంత్రిగా కేటీఆర్.. నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్లారిటీ

KTR as CM: ముఖ్యమంత్రిగా కేటీఆర్.. నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్లారిటీ
మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)

KTR as CM: గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రచారం జరిగినా.. కేటీఆర్ దాన్ని ఖండిస్తూ వచ్చారు. సీఎంగా కేసీఆర్ మరిన్ని ఏళ్లు కొనసాగుతారని.. ఆయన ముందే తాము రిటైరైపోతామని చెప్పిన కేటీఆర్.. ఈసారి మాత్రం ఈ రకమైన ప్రచారంపై బహిరంగంగా స్పందించలేదు.

  • Share this:
    ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారన్నదే హాట్ టాపిక్. టీఆర్ఎస్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు కొద్దిరోజులుగా ఇదే అంశంపై స్పందిస్తున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముందని ఒకరంటే.. ఆయనకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరు కేటీఆర్‌ను కేసీఆర్ సీఎం చేయాలని కోరుతుంటే.. మరో సీనియర్ నేత ఏకంగా కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు అంటూ ఆయన ముందే వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమని తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    అయితే తన గురించి ఈ రకమైన వ్యాఖ్యలు చేయొద్దని.. తన రాజకీయ భవిష్యత్ గురించి ఎవరూ మాట్లాడవద్దని కేటీఆర్ పలువురు నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. అలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని కేటీఆర్ కోరారని సమాచారం. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు కేటీఆర్ ఫోన్ చేసి ఈ విధంగా కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.



    అయితే కొద్దిరోజులుగా తాను తెలంగాణ సీఎం కాబోతున్నానని నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, జరుగుతున్న ప్రచారంపై కేటీఆర్ సైలెంట్‌గా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రచారం జరిగినా.. కేటీఆర్ దాన్ని ఖండిస్తూ వచ్చారు. సీఎంగా కేసీఆర్ మరిన్ని ఏళ్లు కొనసాగుతారని.. ఆయన ముందే తాము రిటైరైపోతామని చెప్పిన కేటీఆర్.. ఈసారి మాత్రం ఈ రకమైన ప్రచారంపై బహిరంగంగా స్పందించలేదు. దీంతో త్వరలోనే కేటీఆర్ సీఎం కాబోతున్నారనే ప్రచారం నిజమే అని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:January 21, 2021, 17:02 IST