సిరిసిల్ల ను దేశంలోనే అగ్రశ్రేణి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా...మంత్రి కేటీఆర్

సిరిసిల్ల పట్టణం మాదిరే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు

రూ.5.15కోట్ల తో సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన అధునాతన రైతు బజార్ ను మంత్రి ప్రారంభించారు.

  • Share this:
    సిరిసిల్ల జిల్లా:  ఐటీ, పురపాకల శాఖ మంత్రి శ్రీ కే తారకరామారావు సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.5.15కోట్ల తో సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన అధునాతన రైతు బజార్ ను మంత్రి ప్రారంభించారు. మార్కెట్ లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. అనంతరం నెహ్రూ నగర్ లో మానే రు వాగు పై రూ.12 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యాం కు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే గణేష్ నగర్ లో రూ.41 లక్షల తో నిర్మించిన పార్క్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను దేశంలోనే అగ్రశ్రేణి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణం మాదిరే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
    ఈ సందర్భంగా రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రమైన కరీంనగర్ నగరం తో పాటు ఇతర పట్టణాలు సైతం స్ఫూర్తిగా తీసుకునేలా సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అని మంత్రి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన రైతు బజార్ స్ఫూర్తిగా తెలంగాణలోని ప్రతి పట్టణంలో సమీకృత రైతుబజార్ ను నిర్మిస్తామని మంత్రి శ్రీ కే తారక రామారావు తెలిపారు. తన సిరిసిల్ల నియోజకవర్గం తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
    First published: