కోదండరాం టీజేఎస్.. ఒక అడ్రస్ లేని సంస్థ, తోక పార్టీ: కేటీఆర్

. ‘పదవుల కోసం గబ్బిలాల్లా పట్టుకున్న సన్నాసులు కావాలా.? తెలంగాణ స్వాభిమానానికి చిరునామా ఆయిన కేసీఆర్ కావాలా. ఆలోచించండి.’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: September 30, 2018, 5:47 PM IST
కోదండరాం టీజేఎస్.. ఒక అడ్రస్ లేని సంస్థ, తోక పార్టీ: కేటీఆర్
టీఆర్ఎస్‌లో చేరిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులతో కేటీఆర్ (Image:KTRTRS/Twitter)
  • Share this:
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది ఢిల్లీకి పోతుందని, టీడీపీకి ఓటేస్తే అది అమరావతికి వెళ్తుందని.. కోదండరాం పార్టీకి ఓటేస్తే అది ఎటు పోతుందో కూడా ఎవరికీ తెలియదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి ఓ అడ్రస్ లేని సంస్థ అని, అది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తోకలా మారిందన్నారు. ఎవరైతే తెలంగాణ బిడ్డలను చంపారో వారితోనే కోదండరాం పొత్తు పెట్టుకోవడం దారుణమని విమర్శించారు. ముష్టి మూడు సీట్ల కోసం కోదండరాం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఆర్య, వైశ్య సంఘం ప్రతినిధులు, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ కూడా ఈసారి దారుణ పరాభవం తప్పదని కేటీఆర్ అన్నారు. మహాకూటమిని గెలిపించి తెలంగాణ ఆత్మాభిమానాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాలా అనే విషయాన్ని ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటున్నందుకే తాము ప్రజాకోర్టుకు వెళ్లామని కేటీఆర్ చెప్పారు. ‘పదవుల కోసం గబ్బిలాల్లా పట్టుకున్న సన్నాసులు కావాలా.? తెలంగాణ స్వాభిమానానికి చిరునామా ఆయిన కేసీఆర్ కావాలా. ఆలోచించండి.’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 30, 2018, 5:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading