తెలంగాణ సీఎంగా కేటీఆర్?... త్వరలో పట్టాభిషేకం?

Telangana Politics : తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరగబోతున్నాయా? కేసీఆర్ వారసుడిగా... కేటీఆర్... సీఎం పీఠం ఎక్కబోతున్నారా?

news18-telugu
Updated: January 15, 2020, 6:34 AM IST
తెలంగాణ సీఎంగా కేటీఆర్?... త్వరలో పట్టాభిషేకం?
కేటీఆర్
  • Share this:
Municipal Polls 2020 : తాను ఆరోగ్యంగా ఉన్నాననీ, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తెలంగాణ సీఎం కేసీఆర్... అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా... త్వరలోనే కేటీఆర్ సీఎం పీఠం ఎక్కబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు మున్సిపల్ పోల్స్... ప్రచారం, హడావుడి ఉండగా... మధ్యలో కేటీఆర్ పట్టాభిషేకంపై న్యూస్ పొలిటికల్ సర్కిల్‌లో హల్ చల్ చేస్తోంది. మున్సిపోల్స్‌లో ఎలాగూ టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని భావిస్తున్న ఆ పార్టీ వర్గాలు... ఆ క్రెడిట్ మొత్తం కేటీఆర్ ఖాతాలో వేసి... ఆయన్ను సీఎం పీఠం ఎక్కిస్తారని తెలుస్తోంది. ఐతే... కేటీఆర్ మాత్రం తనకు అలాంటి అత్యాశలు లేవనీ, తెలంగాణ ఆల్రెడీ కేసీఆర్ సారధ్యంలో పురోగమిస్తోందనీ స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయం ఎలా ఉంటేనేం... పార్టీ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్..., కార్యకర్తలు అందరూ ఇలాంటి ప్రచారమే చేస్తున్నారు. తద్వారా... కేటీఆర్ సీఎం అయితే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ఫలితంగా వారసుణ్ని సీఎం పీఠం ఎక్కించే విషయంలో కేసీఆర్ ఏ సమయంలోనైనా నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు మెరుగయ్యాయి.

కేటీఆర్... ఓవైపు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రిగా చేస్తూనే... మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని ముందుకు నడిపించే విషయంలోనూ తన పట్టు చూపిస్తున్నారు. దీనికి తోడు... పార్టీకి ఇప్పుడు ప్రజల నుంచి మంచి సపోర్ట్ ఉందని భావిస్తున్న పార్టీ వర్గాలు... కేటీఆర్‌ను సింహాసనం ఎక్కించేందుకు ఇంతకంటే బెస్ట్ టైం ఏంకావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా... ఏపీ టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదనీ... అదే బీజేపీలో పాత తరం తర్వాత ప్రధాని మోదీ నెక్ట్స్ తరానికి సెట్ అయ్యారనీ, అలాగే వైసీపీలో వైఎస్ఆర్ తర్వాత ఆయన కొడుకుగా జగన్ సెట్ అయ్యారనీ, మహారాష్ట్ర శివసేనలో కూడా... ఉద్ధవ్ థాక్రే... సెట్ అయ్యారనీ... ఇలాగే... తెలంగాణలో కూడా కేసీఆర్ వారసుడిగా... కేటీఆర్ ఇప్పుడే సీఎం పగ్గాలు తీసుకుంటే... యువ నాయకత్వంలో పార్టీ మరింత దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందనే ప్రచారం సాగుతోంది. అందువల్లే... మున్సిపోల్స్ తర్వాత కేటీఆర్ సీఎం పీఠం ఎక్కడం ఖాయమంటున్నారు చాలా మంది. అదే జరిగితే... మూడున్నరేళ్లకుపైగా ఆయన సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. మొదట్లో కొన్ని సమస్యలు, ప్రతిబంధకాలూ ఎదురైనా... వాటిని సెట్ చేసుకుంటూ... నెక్ట్స్ ఎలక్షన్స్‌కి పార్టీని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కేటీఆర్‌కి ఛాన్స్ ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు