Home /News /telangana /

KTR LAUDS HERO SONU SOOD OF HIS SERVICE TO COVIT PATIENTS VRY

Sonu Sood – KTR : సోనూ సూద్ నిజంగా సూపర్ హీరో మంత్రి కేటిఆర్ ప్రశంస

సోనూ సూద్ నిజంగా సూపర్ హీరో మంత్రి కేటిఆర్ ప్రశంస

సోనూ సూద్ నిజంగా సూపర్ హీరో మంత్రి కేటిఆర్ ప్రశంస

KTR – Sonu Sood: రియల్ హిరో సోనూ సూద్‌ సేవలపై మంత్రి కేటిఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నిజంగా సూపర్ హీరో అంటూ కొనియాడారు. మరిన్ని సేవలు చేయాలని ఆయన కోరారు.



కరోనా కష్ట కాలంలో రియల్ హిరోగా మారిన సోనూ సూద్ గురించి ఎంత ప్రశంసించిన తక్కువే అవుతోంది..దేశంలో ఎప్పుడు ఎవరు తన సహాయాన్ని కోరినా నేనున్నాంటూ ముందుకు వచ్చిన సోనూ సూద్‌కు దేశవ్యాప్తంగా అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు..ఈ నేపథ్యంలనే తాజాగా తెలంగాణ మంత్రి కేటిఆర్ సోనూసూద్‌ సేవలను కొనియాడారు.. ఆయన కష్టకాలంలో ఉన్న ప్రజలకు సహయం చేస్తూ సూపర్‌హీరో గా నిలుస్తున్నాడని కేటిఆర్ కొనియాడారు. ఈనేపథ్యంలోనే సోనూసూద్ లక్షల మంది ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.



అయితే మంత్రి కేటిఆర్ ట్రీట్‌కు స్పందించిన హిరో సోనూసూద్ అందుకు ధన్యవాదాలు తెలిపారు.. తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిదని అందుకోసం కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.ఇక తెలంగాణను తనకు రెండవ పుట్టినిల్లుగా పరిగణిస్తానని సోనూసూద్ చెప్పారు. ప్రజలు తనను సంవత్సరాలుగా ఎంతో ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇందుకు బదులుగా కేటిఆర్ సైతం మరోసారి స్పందించి ప్రాంతీయాభేదాలు లేకుండా అనేక సహయ కార్యక్రమాలు చేయాలని కేటిఆర్ కోరారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, KTR, Sonu Sood

తదుపరి వార్తలు