Home /News /telangana /

KTR LAUDS CONFIDENCE OF JAGTIAL BOY WHO DELIVERING NEWSPAPERS VIDEO GOES VIRAL SU

Paper Boy Video: పేపరేస్తే తప్పేంటి?.. బాలుడు చెప్పిన మాటలకు కేటీఆర్ ఫిదా.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

బాలుడు చెప్పిన మాటలకు కేటీఆర్ ఫిదా

బాలుడు చెప్పిన మాటలకు కేటీఆర్ ఫిదా

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్(Minister KTR) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. రాజకీయ అంశాలపైనే కాకుండా, సామాన్యుల సమస్యలపై కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తుంటారు.

    తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్(Minister KTR) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. రాజకీయ అంశాలపైనే కాకుండా, సామాన్యుల సమస్యలపై కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తుంటారు. అంతేకాకుండా తన దృష్టికి వచ్చిన కొన్ని విషయాలను కూడా ఆయన ట్విట్టర్‌లో నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా ఇంటింటికి తిరుగుతూ పేపర్ వేస్తున్న ఓ బాలుడి వీడియోను కేటీఆర్ ట్విట్టర్‌లో(KTR Twitter) షేర్ చేశారు. ఆ వీడియో తనకు చాలా నచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. వివరాలు.. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థి.. ఓ వైపు తన చదువును సాగిస్తూనే మరోవైపు ఉదయం పూట ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్స్ వేస్తున్నాడు.

    అయితే అతను పేపర్ వేస్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. ఏ స్కూల్‌ అడిగాడు. అందుకు ఆ పిల్లాడు.. పాత బస్టాండ్ వద్దనున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నానని సమాధానమిచ్చాడు. మరి ఈ ఏజ్‌లో పేపర్ వేస్తున్నావ్..? అని ప్రశ్నించగా.. ‘ఏ పేపర్‌ వేయొద్దా?’ అంటూ బదులిచ్చాడు. మంచిది కానీ.. చదువుకుంటున్న సమయంలో పని చేస్తున్నావ్‌గా అని అడగగా.. చదువుకుంటున్నా, పనిచేసుకుంటున్నా అందులో తప్పేముందంటూ అని చెప్పాడు. అంతేకాకుండా ఇప్పుడు కష్టపడితే.. పెద్దయ్యాక ఏం చేయాలన్న ఈజీగా ఉంటుందని అన్నాడు. ఇక, అతని పేరు శ్రీ ప్రకాష్ అని చెప్పాడు.

    Work For Home: ఆ కంపెనీ ఉద్యోగుల్లో చాలామంది మళ్లీ ఆఫీసులకు వెళ్లకపోవచ్చు.. కారణాలివే..



    ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో.. మరింత ప్రాచుర్యం పొందింది. ఈ వీడియోను షేర్ చేసిన కేటీఆర్.. ‘జగిత్యాల (Jagtial) పట్టణం నుంచి వచ్చిన ఈ వీడియో చాలా నచ్చింది. జై ప్రకాశ్ అనే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థి ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానంలో స్పష్టత చూసి చాలా సంతోషం అనిపించింది. చదువుతున్న వయసులో పనిచేయడం తప్పేంటని ఆ విద్యార్థి అడిగాడు. అది అతని భవిష్యత్తులో మంచి స్థానంలో ఉంచుతుంది’అని పేర్కొన్నారు.

    Married Woman: 5 నెలల క్రితం పెళ్లి.. ఆమె జీవితం హ్యాపీగా సాగుతుందని అనుకున్నారు.. కానీ ఇంతలోనే..

    ఇక, ఈ వీడియోపై నెటిజన్లు కూడా చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. బాలుడి చెప్పిన మాటలను, చేస్తున్న పనిని పలువురు అభినందిస్తున్నారు. ఆ పిల్లాడు మంచి పోజిషన్‌లో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Jagtial, Minister ktr, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు