హోమ్ /వార్తలు /తెలంగాణ /

కేటీఆర్ డ్రగ్స్ కు బానిస..ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ డ్రగ్స్ కు బానిస..ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్, బండి సంజయ్

కేటీఆర్, బండి సంజయ్

మంత్రి కేటీఆర్ (Minister KTR) పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ (Minister KTR) డ్రగ్స్ కు బానిస అయ్యాడని అతని వెంట్రుకలు, రక్త నమూనా ఇస్తే నిరూపిస్తామని బండి సంజయ్  (Bandi Sanjay) సవాల్ విసిరారు. ప్రజా సంగ్రామ యాత్రలోభాగంగా నిర్మల్ జిల్లా దిమ్మదుర్తిలో పాల్గొన్న బండి సంజయ్  (Bandi Sanjay) ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మంత్రి కేటీఆర్ (Minister KTR) పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ (Minister KTR) డ్రగ్స్ కు బానిస అయ్యాడని అతని వెంట్రుకలు, రక్త నమూనా ఇస్తే నిరూపిస్తామని బండి సంజయ్  (Bandi Sanjay) సవాల్ విసిరారు. ప్రజా సంగ్రామ యాత్రలోభాగంగా నిర్మల్ జిల్లా దిమ్మదుర్తిలో పాల్గొన్న బండి సంజయ్  (Bandi Sanjay) ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi-YS Sharmila: షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. రాజకీయం మారుతోందా ?

తంబాకు తింటా అనే ప్రచారంపై బండి రియాక్షన్..

ఇక నేను తంబాకు తింటానని కేటీఆర్ (Minister KTR) ప్రచారం చేస్తున్నారు. కానీ నాకు ఆ అలవాటే లేదని బండి సంజయ్  (Bandi Sanjay) అన్నారు. ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలియదని కేటీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నేను తంబాకు తింటాను అని అంటున్నారు దానికి నేను నా రక్తం నమూనా ఇస్తాను. అలాగే నా శరీరంలోని ఆ భాగాన్నైనా ఇస్తాను పరీక్షలకు కూడా సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇక కేటీఆర్ (Minister KTR) వెంట్రుకలు, రక్తం నమూనా ఇచ్చే దమ్ముందా అని బండి సంజయ్  (Bandi Sanjay) ప్రశ్నించారు. డాక్టర్ దగ్గరకు వెళ్లి రెండు వెంట్రుకలు, రక్తం ఇస్తే కేటీఆర్ (Minister KTR) డ్రగ్స్ తీసుకుంటాడో లేదో అనేది ఇట్టే తెలిసిపోతుందని అన్నారు.

ఫ్లాష్..ఫ్లాష్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఏసీబీ కోర్టులో పోలీసులకు చుక్కెదురు

హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసు రీఓపెన్ చేయిస్తాం..

ఇక హైదరాబాద్ , బెంగళూరు డ్రగ్స్ కేసును పక్కా రీఓపెన్ చేయిస్తామని, లంగ దందాలు, దొంగ దందాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అని బండి సంజయ్  (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసు మూసివేయించారని అన్నారు. వాటిని మళ్లీ రీఓపెన్ చేయాలని దర్యాప్తు సంస్థలను కోరుతున్నామని బండి సంజయ్  (Bandi Sanjay) తెలిపారు.

వారం రోజుల పాటు అంబెడ్కర్ ఉత్సవాలు నిర్వహించాలి..

ఇక టీఆర్ఎస్ గంటసేపు కూడా అంబెడ్కర్ జయంతి, వర్ధంతిని నిర్వహించడానికి సమయం కేటాయించడం లేదని అన్నారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించాలని బండి సంజయ్  (Bandi Sanjay) డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే బస్తి, బస్తీలో అంబెడ్కర్ జయంతిని నిర్వహిస్తామని బండి సంజయ్  (Bandi Sanjay) పేర్కొన్నారు.

First published:

Tags: Bandi sanjay, Bjp, Hyderabad, KTR, Telangana, Telangana News, Trs

ఉత్తమ కథలు