హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR : ప్రతి జిల్లాకు క్రిటికల్ కేర్ వార్డులు...ముందుగా నారాయణపేట్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి కేటిఆర్

KTR : ప్రతి జిల్లాకు క్రిటికల్ కేర్ వార్డులు...ముందుగా నారాయణపేట్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి కేటిఆర్

మంత్రి కేటీఆర్(ఫైల్ పొటో)

మంత్రి కేటీఆర్(ఫైల్ పొటో)

Corona Treatment : కరోనా మూడవ వేవ్‌ను ఎదుర్కోనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలకు సిద్దంగా ఉంటోంది..ఇందుకోసం జిల్లా స్థాయిలో ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. దీంతో ప్రతి జిల్లాకు 10 పడకల ఐసీయూ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

కరోనా మూడవ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. గత రెండు వేవ్‌ల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో కరోనా వేవ్‌లను తట్టుకుని చికిత్స అందించేందుకు అన్ని జిల్లాలను సిద్దం చేస్తోంది..ఈ నేపథ్యలంనే ప్రతి జిల్లాలో క్రిటికల్ కేర్ యూనిట్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఆసుపత్రుల్లో కూడా మౌళిక వసతుల కల్పనకు సైతం శ్రీకారం చుట్టింది.

ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలో కొవిడ్‌ను ఎదుర్కోనేందుకు పది పడకలతో కూడిన ఐసీయూ వార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈనేపథ్యంలోనే ముందుగా నారాయణపేట్ జిల్లాలో 10బెడ్ ఐసీయూ ప్రాజెక్టును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ ధర్డ్ వేవ్ తోపాటు రానున్న వేవ్‌లను తట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 1600 ఐసీయూ బెడ్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా ఇప్పటికే ఏర్పడ్డాయని, మరో 7 కొత్తవి రానున్నాయని వ్యాఖ్యానించారు.

మరోవైపు  కరోనా కేసులు రాష్ట్రంలో  క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో  లక్షా 38 వేల 182 పరీక్షల ఫలితాలు రాగా.. 20 70 పాజిటివ్ కేసులు బయటపడినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.  కాగా నేడు కరోనా బారిన పడి మరో 18 మంది మరణించారు. తాజాగా మహమ్మారి నుంచి 3 వేల 762 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం 29 వేల 208  కరోనా ఆక్టీవ్  కేసులున్నాయి.  జీహెచ్​ఎంసీ పరిధిలో 245 మందికి వైరస్‌ నిర్ధరణ అయింది.. కాగా ఖమ్మం జిల్లాలో 172, నల్గొండ జిల్లాలో 156, భద్రాద్రి కొత్తగూడెంలో 120 కేసులు నమోదు అయ్యాయి.

First published:

Tags: Corona alert, Hospitals, KTR

ఉత్తమ కథలు