హైదరాబాద్ అభివృద్ధికి అసలు కారణం ఇదీ... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

Hyderabad : ఐదేళ్లుగా హైదరాబాద్ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్న కేటీఆర్... బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తోందని తెలిపారు.

news18-telugu
Updated: January 19, 2020, 2:24 PM IST
హైదరాబాద్ అభివృద్ధికి అసలు కారణం ఇదీ... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
చార్మినార్ (File)
  • Share this:
Telangana : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం... ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల లిస్టులో మొదటి స్థానంలో నిలవడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాజా ర్యాంకింగ్‌పై స్పందించడం ఆనందంగా ఉందన్న కేటీఆర్... ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ దూసుకుపోతోందన్నారు. 2014లో టాప్ 20లో కూడా హైదరాబాద్ లేదన్న ఆయన... గత ఐదేళ్లుగా స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. 2019లో హైదరాబాద్... ప్రపంచంలో మరే నగరానికీ లేనంతగా... హైఎస్ట్ ఆఫీస్ నెట్ అబ్సార్ప్షన్‌ సాధించిన విషయాన్ని గుర్తుచేసిన కేటీఆర్... ప్రైమ్ ఆఫీస్ రెంటల్ గ్రోత్‌లో కూడా... హైదరాబాద్... ప్రపంచంలోనే బెస్ట్ పెర్ఫార్మింగ్ నగరంగా నిలిచిందన్నారు.




ప్రపంచవ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ అధ్యయన సంస్థ 2020కి మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌‌ను మొదటి స్థానంలో నిలబెట్టింది. ఇందుకు సంబంధించిన సిటీ మూమెంటం ఇండెక్స్‌-2020 జాబితాను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ లిస్టులో మొదటి 20 స్థానాల్లో భారత్‌కు చెందినవి 7 నగరాలున్నాయి. చెన్నై (5వ స్థానం), ఢిల్లీ (7వ స్థానం), పుణె (12వ స్థానం), కోల్‌కతా (16వ స్థానం), ముంబై (20వ స్థానం) ఉన్నాయి.
First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు