Home /News /telangana /

KTR GAVE A FUNNY REPLY TO THE PHOTO POSTED BY INDIAN HIGH COMMISSIONER ANDREW IN UK PRV

KTR Birthday: హా.. హా.. కేటీఆర్​ ఫన్నీ రిప్లై.. నీకు ఇంతకంటే మంచి ఫొటో దొరకలేదా నాయనా..?

ఆండ్రూ పెట్టిన ఫొటో

ఆండ్రూ పెట్టిన ఫొటో

కేటీఆర్​ (KTR) నేడు పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. అయితే యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లేమింగ్ కేటీఆర్​కు విషెష్​ చెబుతూ పెట్టిన ఓ ఫొటో ఇపుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. 

    తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR)  పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు కేటీఆర్కు పుట్టిన రోజు (KTR Birthday) శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రామ్చరణ్, రామ్ గోపాల్ వర్మ, గోపీచంద్ మలినేని, శ్రీనువైట్ల, సోనూసూద్, హరీశ్ శంకర్, అనసూయ, బండ్ల గణేశ్ తదితరులు మంత్రికి విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు. ఇందుకు ప్రతిస్పందనగా కేటీఆర్ (KTR) కూడా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. అయితే యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లేమింగ్ (Andrew Fleming) పెట్టిన ఓ ఫొటో ఇపుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.



    ఆండ్రూ ఫ్లేమింగ్ ట్విట్టర్​లో ఓ ఫొటోను జతచేస్తూ కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.  దీనికి కేటీఆర్ (KTR) ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఆఫొటోపై కేటీఆర్​ ఓ కామెంట్​ కూడా చేశాడు. నీకు ఇంతకన్నా వేరే ఫోటో దొరకలేదా అంటూ సరదాగా కామెంట్ చేశారు. దీంతో ఈ కామెంట్​ ప్రస్తుతం నెటిజన్లలో నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే..  భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లేమింగ్ కేటీఆర్ (KTR)​కు షేక్​ హ్యాండ్​ (Shake Hand) ఇవ్వడానికి చేయి ఇస్తాడు.. కానీ, కేటీఆర్​ మాత్రం అలాగే ఆయనను చూస్తూ ఉండిపోతారు.  ఆ చూపు కొంచెం హాస్యాస్పదంగానే (Funny) ఉంది.  దీంతో కేటీఆర్​ అలా రిప్లై ఇచ్చారు. కాగా, భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓ,ఫెర్రెల్ కూడా కేటీఆర్​కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.

    ఇక రామ్​చరణ్ (Ram charan)​ విషెష్​ తెగ వైరల్​ అవుతోంది. నా ప్రియమైన సోదరుడు, ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు కేటీఆర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు చెర్రీ.



    దీనికి స్పందించిన కేటీఆర్ 'థ్యాంక్స్ బ్రదర్.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నీ నటన గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విన్నాను. త్వరలోనే ఆ సినిమాను తప్పకుండా చూస్తాను' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నటుడు సోనూసూద్ కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన పార్టీ ఎక్కడ భాయ్ అంటూ అడిగారు. అందుకు కేటీఆర్ థ్యాంక్స్ భాయ్ అంటూ రిప్లై ఇచ్చారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Birthday, KTR, Twitter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు