కేటీఆర్‌కు కండ్లకలక ...మూడురోజుల పాటు రెస్ట్

కళ్లను పరీక్షించిన వైద్యులు కండ్లకలక సోకిందని చెప్పి వైద్యం చేశారు. కళ్లు బాగా ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుండడంతో నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలన్నారు.

news18-telugu
Updated: April 16, 2019, 8:28 AM IST
కేటీఆర్‌కు కండ్లకలక ...మూడురోజుల పాటు రెస్ట్
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
news18-telugu
Updated: April 16, 2019, 8:28 AM IST
టీఆర్ఎస్ అగ్రనేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండ్లకలకతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను కళ్ల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ట్వీట్ చేశారు కేటీఆర్. కండ్లకలక కారణంగా సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారు. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హాజరైన కేటీఆర్‌ కళ్లలో ఏదో ఇబ్బందిగా ఉండడంతో వెంటనే వెళ్లి డాక్టర్‌ను కలిశారు. కళ్లను పరీక్షించిన వైద్యులు కండ్లకలక సోకిందని చెప్పి వైద్యం చేశారు. కళ్లు బాగా ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుండడంతో నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలన్నారు. దీంతో అటునుంచి అటే ఇంటికి వెళ్లిన కేటీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న కేటీఆర్.. విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్టు చేశారు.First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...