‘ప్రతి ఆదివారం.. పది గంటలకు.. పది నిమిషాలు..’లో కేటీఆర్.. క్లీనింగ్ ప్రోగ్రామ్

క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న కేటీఆర్

"ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు" కార్యక్రమంలో ఈరోజు మంత్రి తారక రామారావు పాల్గొన్నారు.

  • Share this:
    సీజనల్ వ్యాధుల నివారణ కోసం పురపాలక శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం "ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు" కార్యక్రమంలో ఈరోజు మంత్రి తారక రామారావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన ఇంటిలో ఉన్న పూల కుండీలు, ఇతర ప్రాంతాల్లో నీరు పేరుకుపోయిందా అని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. పూల కుండి నుంచి పేరుకుపోయిన నీటిని తొలగించారు. ప్రగతి భవన్ ప్రాంగణంలో కలియ తిరిగిన మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసీ ఎంటరాలజీ విభాగం అధికారులు సలహా మేరకు యాంటీ లార్వా మందులను చల్లారు. ప్రస్తుతం ప్రజలందరికీ ఆరోగ్యం పైన ప్రత్యేక సృహ ఏర్పడిన నేపథ్యంలో రానున్న వర్షాకాలం నాటికి దోమల వలన కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పురపాలికలు పూర్తిస్థాయిలో సీజనల్ వ్యాధుల ను ఎదుర్కొనేందుకు సన్నద్థంగా ఉన్నాయని అయితే ఆయా మున్సిపాలిటీల ప్రయత్నానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు. రానున్న పది వారాల పాటు కనీసం వారానికి పది నిమిషాల చొప్పున ప్రతి ఒక్కరూ తమ సొంత గృహాలు, తమ పరిసరాల పారిశుద్ధ్యం, పరిశుభ్రత పైన దృష్టి సారిస్తే సీజనల్ వ్యాధుల ను ఎదుర్కొనే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: