హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఈటెల, భట్టి విక్రమార్కతో కేటీఆర్ ముచ్చట..అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్..ఇంతకీ ఏం మాట్లాడుకున్నారంటే?

ఈటెల, భట్టి విక్రమార్కతో కేటీఆర్ ముచ్చట..అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్..ఇంతకీ ఏం మాట్లాడుకున్నారంటే?

కేటీఆర్, ఈటెల రాజేందర్, భట్టి విక్రమార్క

కేటీఆర్, ఈటెల రాజేందర్, భట్టి విక్రమార్క

రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకు అదే పార్టీలో ఉన్న నాయకులూ ఇతర పార్టీలోకి వెళ్లి ఉప్పు నిప్పులా మారిన సందర్భాలు కోకొల్లలు. అయితే కొన్ని రాజకీయ కార్యక్రమాలలో లేదా ఇతర వేడుకల్లో మళ్లీ రెండు పార్టీల నాయకులు తారసపడితే పలకరించుకుంటారా? ఒకవేళ పలకరిస్తే ఏం మాట్లాడుకుంటారనే క్యూరియాసిటీ ప్రజల్లో ఉంటుంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీల ముగ్గురు నాయకులైన బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వంటి నాయకులు ఒకేచోట అది తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు అసెంబ్లీ వద్ద కలవడంతో ఆ క్యూరియాసిటీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

PM Modi Tweet: తెలంగాణపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు!

ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ అయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్ (Minister Ktr) వాళ్ల దగ్గరకు వచ్చి పలకరించారు. ఇక ఈటెల రాజేందర్ (Etela Rajender) కేటీఆర్ (Minister Ktr) ముచ్చటించారు. ఇటీవల హుజురాబాద్ (Huzurabad)లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని అడిగారు. అసలు తనను ఎవరూ పిలవలేదని ఈటెల రాజేందర్ (Etela Rajender) బదులిచ్చారు. ప్రభుత్వం చేపట్టే విధానాలు జనాల్లోకి తీసుకెళ్లే పద్ధతి సరిగా లేదని కేటీఆర్ (Minister Ktr) తో ఈటెల అన్నట్లు సమాచారం.

Telangana Assembly: కేంద్రం ప్రస్తావన లేకుండానే గవర్నర్ తమిళిసై ప్రసంగం

ఇక వీరిద్దరూ ముచ్చట పెడుతున్న సందర్భంలో అక్కడకు వచ్చిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) జాయిన్ అయ్యారు. తన వైపు ఉన్న ఫిర్యాదుల గురించి కేటీఆర్ కు చెప్పారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తనకు సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. కనీసం కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి అయిన పిలవాల్సి ఉండాల్సిందని ఈటెల (Etela Rajender) అన్నారు. ఈ విషయం విన్న కేటీఆర్ చిన్న నవ్వు విసిరారు.

కాగా పార్టీ నుంచి బయటకొచ్చాక ఈటెల రాజేందర్ (Etela Rajender) బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే ఆ పార్టీ నేతలతో, కేటీఆర్ తో ఉప్పు నిప్పులా ఈటెల రాజేందర్ (Etela Rajender) వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ ఈటెలతో ముచ్చటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

First published:

Tags: Bhatti Vikramarka, Etela rajender, KTR, Telangana, Telangana Budget

ఉత్తమ కథలు