Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    నన్ను లైవ్‌లో ప్రశ్నించండి అంటున్న కేటీఆర్... కాచుకోండి అంటున్న నెటిజన్లు...

    AskKTR Session : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై విద్యార్థులు ఆగ్రహంతో ఉన్న వేళ... కేటీఆర్ లైవ్ సెషన్ ఎలా ఉండబోతోంది.

    Krishna Kumar N | news18-telugu
    Updated: April 28, 2019, 10:36 AM IST
    నన్ను లైవ్‌లో ప్రశ్నించండి అంటున్న కేటీఆర్... కాచుకోండి అంటున్న నెటిజన్లు...
    కేటీఆర్
    • Share this:
    ఎన్నికలు అయిపోగానే... ప్రజలకు దూరంగా ఉంటూ... తప్పించుకు తిరిగే నేతల్ని చూస్తూనే ఉంటాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం కాస్త భిన్నం. రెగ్యులర్‌గా ఆయన ట్విట్టర్‌లో అందరికీ అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఏదైనా సాయం కోరితే... స్పందిస్తుంటారు. అలాంటి కేటీఆర్... ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లైవ్‌లో అందుబాటులోకి వస్తున్నారు. ఇంటరాక్టివ్ సెషన్ పెడుతున్నారు. దానికి #AskKTR Session అని పేరు పెట్టారు. ఎవరైనా సరే... లైవ్‌లో కేసీఆర్‌ని ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలకు అప్పటికప్పుడే సమాధానం చెప్పేందుకు సిద్ధమని ఆయన ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేటీఆర్ పెట్టిన ట్వీట్‌కి మంచి స్పందన వస్తోంది.


    తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేటీఆర్ ఈ లైవ్ సెషన్ పెట్టి ఉంటారని తెలుస్తోంది. ఐతే... ఇంటర్ ఫలితాల్లో జరిగిన గందరగోళంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో లైవ్ సెషన్ పెడితే... ఎంతో ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఘాటైన ప్రశ్నలు వేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కేటీఆర్ ట్వీట్‌కి కాచుకోండి అంటూ నెటిజన్లు రిప్లైలు ఇస్తున్నారు. అందువల్ల లైవ్ సెషన్ ఎంత హాట్‌గా ఉంటుందోనన్న ఆసక్తి కలుగుతోంది.

     

    ఇవి కూడా చదవండి :

    ఓటు వేయలేకపోతున్న విరాట్ కోహ్లీ... ఎక్కడ తేడా వచ్చిందంటే...

    తీవ్ర తుపానుగా ఫణి... 30న దక్షిణ కోసావైపు రాక... అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం...

    అహింసా మీట్.. ఇక ల్యాబ్‌లో మాంసం తయారీ... కోళ్లు, మేకలతో పనిలేదు... టేస్ట్ ఎలా ఉంటుందంటే...

    ఏపీలో పెరిగిన పోలింగ్ వైసీపీకి కలిసొస్తుందా... టీడీపీకి మేలు చేస్తుందా...

    మే 26న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తారా... ఆ రోజే మంచిదంటున్న జ్యోతిష్యులు... ఎందుకంటే...
    First published: April 28, 2019, 10:36 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading