నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే సిబ్బందిని భర్తీ చేసేందుకు నిర్ణయించింది.

news18-telugu
Updated: July 11, 2020, 11:14 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..
మంత్రి కేటీఆర్ (File)
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే సిబ్బందిని భర్తీ చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో మున్సిపాలిటీల అభివృద్ధి ప్రణాళికపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్షా నిర్వహించారు. రానున్న మూడు సంవత్సరాల్లో మున్సిపాలిటీల రూపురేఖలు మార్చేందుకు కంకణం కట్టుకున్నామని, ఆ దిశగా నాయకులు, అధికారులు పనిచేసేలా చూస్తామన్నారు. అభివృద్ధిలో ప్రత్యేక వ్యూహంతో దూసుకుపోతున్న సిద్ధిపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, తడి, పొడి చెత్త సేకరణ, పన్ను వసూళ్లు ఇలా మొత్తం 42 అంశాల ప్రాతిపదికగా తీసుకుని మున్సిపాలిటీని అభివృద్ధి పరచాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పాత బస్సులను తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 400 షీ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణను మొక్కుబడిగా కాకుండా కొత్త ఒరవడితో సేకరించాలని, మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5.30 గంటల నుంచి వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా మొదటి వారంలోనే నెలకు రూ.12వేల చొప్పున వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
Published by: Narsimha Badhini
First published: July 11, 2020, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading