హోమ్ /వార్తలు /తెలంగాణ /

Krishna: టాలీవుడ్‌కు తీరని లోటు.. కృష్ణ మరణం పట్ల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం

Krishna: టాలీవుడ్‌కు తీరని లోటు.. కృష్ణ మరణం పట్ల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం

సీఎం కేసీఆర్, కృష్ణ, సీఎం జగన్

సీఎం కేసీఆర్, కృష్ణ, సీఎం జగన్

RIP Krishna: ప్రముఖ టాలీవుడ్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు (CM KCR), ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ టాలీవుడ్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (RIP Krishna) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.   నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘీక చిత్రాల నటుడుగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో‌గా, సూపర్ స్టార్‌గా సొంతం చేసుకున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణదేనన్నారు.

అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కృష్ణ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆంధ్రా జేమ్స్ బాండ్‌గా  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో ఆయన ఎంతో అద్భుతంగా నటించారని గుర్తు చేసుకున్నారు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారని అన్నారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు సీఎ వైఎస్ జగన్.

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna Passes away).. ఇవాళ తెల్లవారుఝామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో 80 ఏళ్ల వయసులో  కన్నుమూశారు. నిన్న గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో  హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయలేదు.   వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయన (RIP Krishna) కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగా స్పందించలేదు.  క‌ృష్ణ ఆరోగ్య విషమంగానే ఉందని నిన్న మధ్యాహ్నం డాక్టర్లు కూడా చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేదని తెలిపారు. కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు. కానీ వైద్యులు ప్రయత్నాలు గానీ.. అభిమానుల పూజలు గానీ ఫలించలేదు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కృష్ణ .

దివికేగిన నటశేఖరుడు.. సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానం.

భార్య ఇందిరా దేవి, పెద్దకుమారుడు రమేష్ బాబు మరణాల తర్వాత కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది.  కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ధైర్యంగా ఉండాలంటూ కుమారుడుకు మహేష్ బాబుకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.

First published:

Tags: CM KCR, Krishna, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు