హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad: ఎస్ఐ​ నుంచి కమిషనర్​.. అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు నిజామాబాద్​లో పోస్టింగ్​..

Nizamabad: ఎస్ఐ​ నుంచి కమిషనర్​.. అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు నిజామాబాద్​లో పోస్టింగ్​..

నాగరాజు, కార్తికేయ (ఫైల్​)

నాగరాజు, కార్తికేయ (ఫైల్​)

నిజామాబాద్ కమిషనర్ (Nizamabad Commissioner)​గా  నియమితులైన K R నాగరాజు (K R Naga raju) 1985లో పోలీసు విభాగంలో ఎస్సై (SI)గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు..

(న్యూస్ 18 తెలుగు ప్రతినిధి : పి మహేందర్)

నిజామాబాద్ కమిషనర్ (Nizamabad Commissioner)​గా  నియమితులైన K R నాగరాజు (K R Naga raju) 1985లో పోలీసు విభాగంలో ఎస్సై (Sub Inspector)గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు.. వరంగల్​లో  ఎస్సైగా, సీఐ గా పనిచేశారు. నాన్  క్యాడర్ ఎస్​పీ (Non cadre SP) గా ఉన్న నాగరాజు కు ఇటీవలే ఐపీఎస్ (IPS) గా ప్రమోషన్ వచ్చింది. ఐపీఎస్ గా పదోన్నతి పొందిన తర్వాత నిజామాబాద్ రెండో కమిషనర్ గా  నియమితులవ్వడం  విశేషం.  అప్పటివరకు నిజామాబాద్​కు కమిషనర్​గా ఉన్న కార్తికేయను బదిలీ చేశారు.

ఆరేళ్ల తర్వాత..

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ విధుల్లో చేరిన ఆరు సంవత్సరాల తర్వాత బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు (Orders) జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐ పీఎస్ అధికారుల బదిలీ చేయగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయను  హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (As the Joint Commissioner of Hyderabad) గా నియమించారు.. 2016 అక్టోబర్ 11న కొత్తగా ఏర్పడిన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తొలి కమిషనర్ గా  కార్తికేయ నియమితులయ్యారు.

రెండేళ్ల క్రితం  కార్తికేయ డీఐజీ (DIG) గా పదోన్నతి పొందారు..  కానీ , పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు  జిల్లాలో ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసిన ఎస్పీ గాని..  కమిషనర్ గానీ ఎవరూ లేరు. దాదాపు ఆరు సంవత్సరాల పాటు (Six years) కొనసాగిన కార్తికేయను హైదరాబాద్ (Hyderabad) కు  బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సీఐడీ విభాగంలో ఎస్పీ (SP)గా పని చేస్తున్న కె ఆర్ నాగరాజు (K R Naga raju) ను  నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.


సీఐడీకి కేసు..

నిజామాబాద్ తొలి కమిషనర్ గా  పనిచేసిన కార్తికేయ (Karthikeya was the first commissioner of Nizamabad)కు సౌమ్యుడిగా  పేరుంది. జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నారు కార్తికేయ. అయితే సిరికొండ మండలం న్యావనంది కి చెందిన మమత హత్య కేసు ఏడాది గడిచినా కొలిక్కి రాలేదు. సిట్ (SIT)  ఏర్పాటు చేసిన దర్యాప్తు పూర్తి కాకపోవడంతో సీఐడీ (CID)కి కేసు బదిలీ చేశారు. ఈ విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Nizamabad MP Dharmapuri Arvind) కు సీపీ కి మధ్య కోల్డ్​ వార్​ నడిచింది. . ఈ హత్య  రాజకీయ దుమారం లేపింది. కమ్మర్పల్లి మండలం ఆశకొత్తూరు లో  బీజేపీ కార్యకర్త (BJP activist)హత్య కేసులోనూ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాతే  పీడీ యాక్టు నమోదు ప్రారంభమైంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

ఇది కూడా చదవండి: సొరంగంలో నుంచి బయటకొచ్చిన 17 మంది అమ్మాయిలు.. పోలీసులు షాక్​.. ఇంతకీ ఏంటీ కథ.. ఎక్కడ జరిగింది.. 

First published:

Tags: Nizamabad, Nizamabad police

ఉత్తమ కథలు