Home /News /telangana /

KOTHAGUDEM MLA VANAMA VENKATESWARA RAO VIOLATES COVID 19 AND LOCKDOWN RULES VB KMM

Covid Rules Break: లాక్‌డౌన్ రూల్స్‌ ఉల్లంఘించిన ఎమ్మెల్యే.. పట్టించుకోని అధికారులు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం (Image credit : vectorstock)

ప్రతీకాత్మక చిత్రం (Image credit : vectorstock)

Covid Rules Break: కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్ రూల్స్‌‌ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు మాత్రం నిబంధనలనే బేఖాతరు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తుంటే.. కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్ చెక్కుల పేరుతో ప్రచార అర్భాటం కోసం లబ్ధిదారులను, కార్యకర్తల ను సుమారు 300 మంది కి పైనే ఒకే చోట చేర్చడం లాక్ డౌన్ ఉల్లంఘన కాదా అని పలువురు విమర్శిస్తున్నారు. ఓ వైపు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా నేపథ్యంలో చెక్కులను ఎక్కడికక్కడ డివిజన్లలో కార్పొరేటర్లే పంపిణీ చేయాలని సూచించగా.. ఇక్కడ మాత్రం స్వయంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వందలాదిమందిని ఒక్కచోటికి చేర్చి పంపిణీ చేశారు. ఓ వైపు కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో లక్డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అదేశిస్తున్నప్పటికీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కు మాత్రం నిబంధనలు వర్తించడం లేదు. ఏదైనా కార్యక్రమం కేవలం 50 మంది తో చేయాలని నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పది గంటల తర్వాత కళ్యాణ లక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

    ఈ పంపిణీ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్ తో కలిపి సుమారు 200 మందికి పైగానే హాజరుకావడం గమనార్హం. తన ప్రచారం కోసం లబ్ధిదారులను, కార్యకర్తల ను భారీ సంఖ్యలో జమ చేయడం గమనార్హం.

    చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వనమా


    కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు


    గత ఏడాది కూడా ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపి అనేక మందికి కరోనా వ్యాప్తికి కరణమయ్యాడనే విమర్శలు ఉన్నపటికీ ఇప్పుడు అదే తరహాలో సమావేశాలు ఏర్పాటు చేయడం పట్ల అధికారులు చూసిచూడనట్లు వ్యహరించడం, లక్డౌన్ నిబంధనలు కేవలం సామాన్యులకు మాత్రమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Bhadradri kothagudem, Covid rules, Rules break

    తదుపరి వార్తలు