Vanama Raghava : వనమా రాఘవ అరాచాలకు నిరసనగా కొత్తగూడెం నియోజకవర్గం బంద్ కొనసాగుతోంది. ప్రతిపక్షాల పిలుపు మేరకు ప్రజలు బంద్‌లో పాల్గోంటున్నారు. రాఘవ మాత్రం ఇంకా తప్పించుకుని తిరుగుతున్నాడు..
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా నాగేశ్వర్రావు కుమారుడు వనమా రాఘవ బెదిరింపులు, మోసాలకు రామకృష్ణ కుటుంబం బలికావడంతో రాఘవ అక్రమాలు, దురాఘతాలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ అండతో ఇన్నాళ్లు ఎన్ని ఆగడాలు చేసిన పట్టించుకోని పోలీసుల వ్యవహారశైలి ఫలితంగా నిండుకుటుంబం బలైంది. కాగా అంతకుముందే రాఘవ చేసిన అరాచాకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి..
కుటుంబతగదాల్లో అనధికారంగా ఎంటర్ అయి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడవాళ్లను కూడా వాడుకున్నాడు. పంచాయితీలకు వెళ్లిన వారితో సాన్నీహిత్య సంబంధం పెట్టుకుని మిగతా వారికి అన్యాయం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు..ఇలా తన అరాచాలకు అడ్డు అదుపు లేకపోవడంతో రాఘవ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే రామకృష్ణ కేసులో ముద్దాయిగా రాఘవను పోలీసులు మాత్రం ఇంకా పట్టుకుంటామనే చెబుతున్నారు. ఆయన తండ్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా కొడుకును తీసుకువచ్చి పోలీసులకు అప్పగించలేని పరిస్థితి నెలకొంది.
Huzurabad : కడప నుండి కరీంనగర్‌కు చేరింది, అయినా యువతికి దక్కని న్యాయం, చలిలోనే..! ఇంతకి ఏం జరిగింది..?
ఈ క్రమంలోనే రాఘవను అరెస్ట్ చేయాలంటూ విపక్షలు గళం విప్పాయి.. ఇందుకోసం ఏకంగా కొత్తగూడెం బంద్‌కు పిలుపునిచ్చాయి.. రాఘవను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశాయి.. రోడ్డు మీద బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే రాఘవ మాత్రం దర్జగా మీడియాకు ఇంటర్యూ ఇస్తూ తప్పించుకు తిరిగే పరిస్థితిని కొనసాగిస్తున్నాడు.
మరోవైపు తన కొడుకును పట్టించేందుకు సహకరిస్తానని, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిజాలు తేలేవరకు రాజకీయాలకు దూరంగా ఉంచుతానని ఆయన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జరిగిన సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూనే ప్రతిపక్షాలపై విరుచుకపడ్డాడు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.