Success Story: సర్కారు బడి నుంచి ఐపీఎస్‌ అధికారిగా.. అతడి స్టోరీ చదివితే సివిల్స్ సాధించడం సులువే..!

కోట కిరణ్ (సివిల్ ర్యాంకర్)

అతను పక్కా పల్లెటూరి యువకుడు. ఓనమాలు దగ్గరి నుంచి సర్కారు బడిలోనే చదువంతా.. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఐపీఎస్‌ సాధించారు. ఎగుడు దిగుడు కష్టాలను పంటి బిగువున భరిస్తూ చదువంతా పూర్తిచేసి సివిల్స్‌ కోసం కూర్చున్నారు. మొదటి ప్రయత్నంలో రాలేదు. మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు కోట కిరణ్‌.

 • Share this:
  (G. Srinivas Reddy, News18, Khammam)

  అతను పక్కా పల్లెటూరి యువకుడు. ఓనమాలు దగ్గరి నుంచి సర్కారు బడిలోనే చదువంతా.. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఐపీఎస్‌ సాధించారు. ఎగుడు దిగుడు కష్టాలను పంటి బిగువున భరిస్తూ చదువంతా పూర్తిచేసి సివిల్స్‌ కోసం కూర్చున్నారు. మొదటి ప్రయత్నంలో రాలేదు. తాను దిగులు చెందలేదు. రెండో ప్రయత్నంలోనూ రాలేదు. అయినా చెదరలేదు. ముచ్చటగా మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు కోట కిరణ్‌. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి మొదలైన కిరణ్‌ ప్రస్థానం ఐఐటీ ఖరగ్‌పూర్‌ దాకా సాగింది. నావల్‌ ఆర్కిటెక్చర్‌, ఓషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సివిల్‌ సర్వెంట్‌గా ప్రజలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్షలకోసం ప్రిపేర్‌ అయ్యారు.

  Central Govenment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఫలాలు వారికి కూడా.. 


  మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. తన విజయంతో అనేక మంది యువతకు స్ఫూర్తిగా నిలిచిన కోట కిరణ్ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందినవారు. కిరణ్ సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించారు అని తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కిరణ్‌ తల్లి వజ్రమ్మ ప్రస్తుతం బీమవరం సర్పంచిగా ఉన్నారు.

  Huzurabad By Elections: టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ ఇదేనా.. అందుకే వాళ్లతో ఇలా చేస్తున్నారా..?


  సాధారణంగా సివిల్స్‌ పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే పట్టణ వాతావరణంలో పెరగాలి. ఇంగ్లిష్‌ బాగా రావాలి అన్న అపోహ ఉంటుంది. కానీ ఏ వాతావరణంలో పెరిగినా.. ఎక్కడ చదువుకున్నా.. ఇంగ్లిష్‌ వచ్చినా రాకున్నా కృషి, పట్టుదలతో సివిల్స్‌ పరీక్షల్లో విజయం సాధించవచ్చని కోట కిరణ్‌ నిరూపించారు. గ్రామానికి చెందిన కోట కృష్ణయ్య, వజ్రమ్మల చిన్న కొడుకు అయిన కిరణ్‌ ప్రాధమిక విద్య అంతా స్థానిక భీమవరం ప్రాధమికోన్నత పాఠశాలలోనే సాగింది. అనంతరం ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా దమ్మపేట గురుకుల పాఠశాలలోనూ.. అనంతరం ఇంటర్‌మీడియట్‌ను నాగోల్‌ గురుకులంలోనూ చదివారు.

  Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇంత దారుణమా.. చెవి, ముక్కులో విషాన్ని లోపలికి పంపి.. చివరకు..


  అనంతరం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ పూర్తిచేసి తన జీవిత లక్ష్యం అయిన సివిల్స్‌ ప్రిపరేషన్‌కు పూనుకున్నారు. ఒకటి.. రెండు ప్రయత్నాల్లో విజయం దరికి చేరలేకపోయినా విరామం లేకుండా విసుగు చెందకుండా అనుకున్నది సాధించేదాకా విశ్రమించలేదు. 2020 యూపీఎస్సీ పరీక్షల్లో 652 ర్యాంకు సాధించారు. ర్యాంకును బట్టి ఐపీఎస్‌కు ఎంపిక అయ్యే అవకాశం ఉన్నట్టు కిరణ్‌ సోదరుడు బాబూరావు చెప్పారు.

  UPSC Engineering Services: యూపీఎస్సీ ఇంజినీరింగ్​ సర్వీసెస్​ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, పూర్తి వివరాలివే..


  పెద్దపల్లి జిల్లాలోని తాండూరు సర్కిల్‌ ఇన్సెపెక్టర్‌గా పనిచేస్తున్న కోట బాబూరావు 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ చిన్ననాటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి కనబరిచే కిరణ్ తన కృషి పట్టుదలతో ఈ ర్యాంక్ ను సాధించారన్నారు. దక్షిణ భారతదేశంలోని ఏదో ఒక రాష్ట్రానికి తన సోదరుడు అలాట్‌ అయ్యే అవకాశం ఉందన్నారు. ‌కృషి పట్టుదలతో శ్రమిస్తే అనుకున్నది సాధించగలమన్నది కిరణ్‌ విషయంలో రుజువైందన్నారు. ‌
  Published by:Veera Babu
  First published: