కరీంగనర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు కొండపోచమ్మ సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. కారులో ఒక్కడే ఉండడం.. అతడికి ఈత రావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి కారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్నాడు. సాయంత్రం సమయంలో రిమ్మనగూడ వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి కొండపోచమ్మ సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు కీటికి తెరిచి అందులో నుంచి బయటపడ్డారు. నీటిలో ఈదుకుంటూ ఒడ్డును చేరుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అధికారులు క్రేన్ సాయంతో కారును నీటిలో నుంచి బయటకు తీశారు. అయితే కారు డ్రైవర్ మంచి ఈతగాడు కావడంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ నీటిలో ఈదుకుంటూ బయటకు రాగలిగాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Karimangar, Telangana