తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు... చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి. చేవెళ్లలో తన గెలుపు కోసం మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టి ప్రజా కూటమిగా బరిలో దిగిన టీజేఎస్... ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. అప్పటి నుంచీ మూడు నెలలుగా ఆ పార్టీ నేతలు, కోదండరాం స్దబ్తుగా ఉన్నారు. అప్పుడప్పుడూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డికి మద్దతుపై స్పష్టమైన హామీ ఇవ్వని కోదండరాం... సానుకూలంగా స్పందించారు. తాజాగా మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అమలు సాధ్యం
కాని హామీలు ఇచ్చి... అధికారంలోకి అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం... డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీని గాల్లోకి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు కుటుంబ సభ్యులు ఓ రాష్ట్రాన్ని శాశించడం తాను ఎక్కడా చూడలేదన్నారు.
తనకు రాజకీయ పరిజ్ఞానం అంతగా లేకపోయినా... తన ఆలోచనలతో చేవెళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కోసం తన గెలుపు తప్పనిసరి అన్న ఆయన... తన కోసం కాకపోయినా... ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసమైనా కాంగ్రెస్‌కు ఓటు వెయ్యాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత... కొంతమంది పార్టీని వీడి వెళ్లిపోయారన్న కోదండరాం... అంతమాత్రాన పార్టీ నిర్మాణానికి ఎలాంటి నష్టమూ లేదన్నారు. పార్టీ నిర్మాణం యథాతథంగా జరుగుతుందనీ... కార్యకర్తలు అంతా కలిసి పని చేస్తున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి :
Congress Election Manifesto : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హైలెట్స్ ఇవే...
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం... మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్... ఆ రాష్ట్రాలకు కూడా...
లోక్ సభ ఎన్నికల అస్త్రంగా న్యాయ్... కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైలెట్ అదే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chevella S29p10, Konda Vishweshwar reddy, Telangana, Telangana Lok Sabha Elections 2019