హోమ్ /వార్తలు /telangana /

చేవెళ్లలో టఫ్ ఫైట్... కొండా విశ్వేశ్వర రెడ్డికి చిరంజీవి అండ... మద్దతుగా ప్రచారం చేస్తారా?

చేవెళ్లలో టఫ్ ఫైట్... కొండా విశ్వేశ్వర రెడ్డికి చిరంజీవి అండ... మద్దతుగా ప్రచారం చేస్తారా?

Lok Sabha Elections 2019 : ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున చేవెళ్ల నుంచీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి బరిలో దిగారు. అందువల్ల తన తరపున చిరంజీవి ప్రచారం చేస్తే... మైలేజ్ పెరుగుతుందని విశ్వేశ్వర రెడ్డి భావిస్తున్నారు.

    చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మరోసారి అక్కడి నుంచీ కాంగ్రెస్ తరపున బరిలో దిగడంతో... ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరారు. చేవెళ్ల నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసి ఎన్నిక‌య్యారు. తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున చేవెళ్ల నుంచీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి బరిలో దిగారు. ఎలాగైనా ఈ స్థానాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అందువల్ల తన తరపున చిరంజీవి ప్రచారం చేస్తే... మైలేజ్ పెరుగుతుందని విశ్వేశ్వర రెడ్డి భావిస్తున్నారు. పైగా... చిరంజీవి కోడలైన ఉపాసనకు విశ్వేశ్వర రెడ్డి బాబాయ్ వరుస అవుతారు. అందువల్ల విశ్వేశ్వర రెడ్డి, చిరంజీవిని కలిసి తన తరపున ప్రచారం చేయమని కోరినట్లుగా తెలిసింది.

    2004లో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం పొందిన రంజిత్‌ రెడ్డి వ్యాపారవేత్త. చేవెళ్లలో ఎస్‌ఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ పేరుతో పౌల్ట్రీ పరిశ్రమలను నెలకొల్పారు. చాలా గ్రామాల్ని దత్తత తీసుకొని వేల కుటుంబాలకు మెరుగైన వైద్యం అందింస్తున్నారు. అందువల్ల ఆయన గెలుపు ఖాయమంటోంది టీఆర్ఎస్ పార్టీ.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి ఉపముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడు విశ్వేశ్వర్‌రెడ్డి. అమెరికాలో ఎంఎస్‌ (ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌) పూర్తిచేశారు. తెలంగాణలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆస్తుల విషయంలో రూ.895 కోట్లతో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అగ్ర స్థానంలో ఉన్నారు. తనకు రూ.895 కోట్ల ఆస్తులున్నాయని, వాటిలో చరాస్తులు రూ.856 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తెలిపారు. రూ.35.81 కోట్ల అప్పులున్నాయని వివరించారు. వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనపై ఓ కేసు నమోదైందని తెలిపారు.

    ఇవి కూడా చదవండి :

    Pics : ఎలుకల పొట్టలో డ్రగ్స్ ప్యాకెట్లు, మొబైల్స్... షాకైన పోలీసులు

    Pics : బుమ్రా భుజానికి గాయం... ప్రపంచకప్ ఆశలు గల్లంతేనా... విషయాన్ని ఎందుకు దాస్తున్నారు?

    First published:

    ఉత్తమ కథలు