హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad : నేడు జోడేఘాట్ లో కొమురంభీం వర్ధంతి.. తెరకెక్కుతున్న కొమురంభీం చరిత్ర

Adilabad : నేడు జోడేఘాట్ లో కొమురంభీం వర్ధంతి.. తెరకెక్కుతున్న కొమురంభీం చరిత్ర

Adilabad : నేడు జోడేఘాట్ లో కొమురంభీం వర్ధంతి..

Adilabad : నేడు జోడేఘాట్ లో కొమురంభీం వర్ధంతి..

Adilabad : జల్… జమీన్…జంగిల్… నినాదంతో అమాయక గిరిజనుల హక్కుల కోసం, స్వేచ్చ కోసం నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన గిరిజన వీరుడు కొమురంభీం వర్థంతి నేడు.. ఈ సంధర్భంగా ఆ పోరాట యోధుడి చరిత్ర మరోసారి వెండితెరపైకి ఎక్కబోతోంది.

ఇంకా చదవండి ...

  ఇప్పటికే ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ వెలువడింది. కొంత వివాదాన్ని కూడా మూటగట్టుకుంది. టీజర్ లో కొమురంభీం పాత్రధారి జూనియర్ ఎన్టీఆర్ వేషధారణపై ఇక్కడి గిరిజనులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఇప్పటికి ఆ చిత్రం నిర్మాణ దశలోనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గిరిజన పోరాట వీరుడు కొమురంభీం పాత్రను పోషిస్తుండగా, రాంచరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎప్పుడేప్పుడు ఈ చిత్ర నిర్మాణం పూర్తయి, ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని తెరపైకి ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

  ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికంటే ముందే అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో భూపాల్ రెడ్డి కథానాయకుడిగా కొమురంభీం సినిమాను తెరకెక్కించారు. ఆ చిత్రం విడుదలకే దశాబ్దాల కాలం పట్టింది. ఎట్టకేలకు 20 సంవత్సరాల తర్వాత అన్ని అడ్డంకులను తొలగించుకొని సినిమా విడుదలై 100 రోజులు ప్రదర్శితమైంది. మళ్ళీ సుదీర్ఘకాలం తర్వాత ఇద్ద్దరు మన్యం వీరుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపొందడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

  ఇది చదవండి : టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా నేడు ఏపీ బంద్


  అయితే ఇందులో ఒకరైన మన్య్హం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర ప్రాచూర్యం పొందింది. అయితే తెలంగాణాలోనే అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అమాయక ఆదివాసి గిరిజనుల ప్రతినిధిగా వారి హక్కుల కోసం పోరాడి అసువులు బాసిన గిరిజన వీరుడు కొమురంభీం చరిత్రకు చెప్పుకోదగిన ప్రాచూర్యం లభించలేదన్నవాదనలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారగ్రహీత, సాహితివేత్త డా. సామల సదాశివ మాష్టారు ఏడవ తరగతి తెలుగు వాచకంలో కొమురంభీం పాఠ్యాంశాన్ని చేర్చి బయటి ప్రపంచానికి ఆయన గురించి తెలిసేల చేశారు.

  ఇది చదవండి  :కారు పేపర్లు చూపించమన్న కానిస్టేబుల్‌ను.. ఏకంగా కారులోనే వేసుకుని వెళ్లాడు..


  ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాకే చెందిన ప్రముఖ రచయిత అల్లం రాజయ్య సాహుతో కలిసి కొమురంభీం జీవిత చరిత్రను నవలగా చిత్రించారు. కాగా గిరిజనుల హక్కుల కోసం నాటి ఆసిఫాబాద్ ప్రాంతంలోని 12 గ్రామాల గిరిజనులను ఏకం చేసి నిరంకుశ నిజాం ప్రభుత్వంపై పోరుసల్పిన యోధుడు కొమురంభీం. 1901 అక్టోబర్ 22న సంకెపల్లిలో చిన్ను, సోంబాయి దంపతులకు జన్మించాడు. తండ్రి మరణానంతరం అక్కడి నుండి సుర్దాపూర్ కు మకాం మార్చిన కొమురంభీం గిరిజనులపై నిజాం సైన్యం, అటవీ సిబ్బంది ప్రదర్శిస్తున్న జులుంను ఎదిరించి గిరిజన హక్కుల కోసం అలుపెరుగని పోరాటాం చేశాడు. ఇందులో భాగంగా 12 గ్రామాల గిరిజనులను సమీకరించాడు. చివరకు జోడె ఘాట్ లో అసువులుబాసాడు.

  అయితే తమ హక్కుల కోసం పోరడి అమరుడైన కొమురంభీంను ఇక్కడి గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ప్రతియేటా భీం వర్ధంతి రోజున జోడేఘాట్ లోని భీం సమాధి వద్ద తమ సంప్రదాయ పద్దతిలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి నివాళులు అర్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వం జోడేఘాట్ లో భీ నిలువెత్తు కాంస్య విగ్రహాంతోపాటు ప్రత్యేక స్మారక చిహ్నాన్ని, గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే మ్యూజియంను నెలకొల్పింది. ఈయేడు కూడా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ లో భీం వర్ధంతి కోసం ఉట్నూరులోని ఐటిడిఏ అన్ని ఏర్పాట్లు చేసింది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Adilabad

  ఉత్తమ కథలు