ఎంపీ కోమటిరెడ్డి ఇంట పెళ్లివేడుక.. వైసీపీ నేతతో వియ్యం...

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.

news18-telugu
Updated: August 5, 2020, 3:56 PM IST
ఎంపీ కోమటిరెడ్డి ఇంట పెళ్లివేడుక.. వైసీపీ నేతతో వియ్యం...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె నిశ్చితార్థం
  • Share this:
భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. కర్నూలుకు చెందిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శిల్పా మోహన్‌ రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్‌ రెడ్డి కుమారుడికి ఆమెను ఇచ్చి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ వేడుకకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనకు దగ్గరగా ఉండేవారు. అలా జగన్ తోకూడా అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో వైసీపీకే చెందిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడి కుమారుడికి తన కుమార్తెను ఇచ్చేందుకు వెంకట్ రెడ్డి ముందుకొచ్చారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading