Home /News /telangana /

KODI PUNJU BIDS 30 THOUSAND RUPEES IN SANGAREDDY DISTRICT COURT OFFICIALS AUCTION SNR

Telangana : ఆ కోడి ఖరీదు 30వేల రూపాయలు .. దాని స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

costly Kodi Punju

costly Kodi Punju

Telangana: కోడి మాంసం ధర కిలో 200 నుంచి 300రూపాయలు ఉంటుంది. కాని పందెం కోడి మాంసం ధరకు అందుకు రెట్టింపు ఉంటుంది. కోడి పందెల్లో చనిపోయిన కోడిని , గెలిచిన కోడిపై వేలం వేస్తారు. సంగారెడ్డి జిల్లాలో కూడా అలాగే వేలం వేస్తే ఓ పందెం కోడి రికార్డ్‌ ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi)
పందెం కోడి కూర కోసం ఎంతో మంది మాంసప్రియులు ఆశగా ఎదురుచూస్తుంటారు. కోడి పందెల్లో గెలిచిన కోళ్లను, ఓడిపోయిన కోళ్లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పందెం కోడి మాంసం 250నుంచి 350రూపాయల మధ్య ఉంటుంది. కాని సంగారెడ్డిSangareddy జిల్లాలో ఓ పందెం కోడి రికార్డ్‌ ధరRecord price పలికింది. వంద, వెయ్యి కాదు ఏకంగా 30వేల రూపాయలు (30 thousand rupees)పలికిందంటే ఆ పందెం కోడికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఇట్టే అర్ధమవుతుంది.

Crime news : వయసులో ఉన్న జిమ్ ట్రైనర్‌తో శారీరక సుఖానికి అలవాటు పడింది ..అడ్డుగా ఉన్నాడని భర్తను..



ఒక్క కోడి ఖరీదు 30వేలు..
సహజంగా సంక్రాంతి కోడి పందెల్లో గెలిచిన కోడి పుంజులు మార్కెట్‌లో రికార్డ్ స్థాయిలో ధర పలుకుతాయి. కాని సంగారెడ్డి జిల్లాలో మాత్రం కోళ్ల పందెలు నిర్వహిస్తుంటే పోలీసులు పట్టుకున్న కోడికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈనెల 7వ తేదిన రాత్రి పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని మామిడి తోటలో జోరుగా కోడి పందెలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కోడి పందెల స్థావరంపై దాడి చేసి కొందర్ని అరెస్ట్ చేశారు. సుమారు 31 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం నేరం కాబట్టి పందెల్లో పట్టుబడిన కోళ్లను పోలీసులు కోర్టుకు సమర్పించారు.



పట్టుబడ్డ కోడికి భలే డిమాండ్..
పందెం రాయుళ్ల దగ్గర పట్టుబడిన కోడి పుంజులను సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జిల్లా ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి హన్మంతరావు సమక్షంలో అధికారులు వేలం పాట నిర్వహించారు. ఈ పందెం కోళ్లను దక్కించుకోవడం కోసం సుమారు 50మంది వేలం పాటలో పాల్గొన్నారు. పట్టుబడిన 31 పందెం కోళ్లను వేలం నిర్వహించారు. వేలం పాటలో మొత్తం 31 పందెం కోళ్లను విక్రయించారు. కోళ్లను వేలం వేయడం ద్వారా 4లక్షల 46వేల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా ఒక కోడికి రూ.30 వేల ధర పలకడం విశేషం.

Cloudburst: క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? కృత్రిమ వర్షం సాధ్యమేనా? భారత్‌లో వరదల వెనక చైనా కుట్ర ఉందా?



పందెం కోడా మజాకా ..
పందెం కోళ్లకు మార్కెట్‌లో ఇంత డిమాండ్ ఉందని తెలిసి కోర్టు అధికారులే షాక్ అయ్యారు. కోడి పందెల స్థావరాలపై దాడుల్లో పట్టుబడిన కోళ్ల ద్వారా నాలుగున్నర లక్ష ఆదాయం వస్తే కేవలం ఒక్క కోడిపుంజుకే అందులో 30వేలు రావడం చూసి ఆశ్చర్యపోయారు. 30వేలకు పందెం కోడిని దక్కించుకున్న యజమాని మాత్రం పందెం కోళ్లకు ఆ మాత్రం డిమాండ్ ఉంటుందిలే అని గొప్పిగా చెప్పుకుంటున్నారంట.
Published by:Siva Nanduri
First published:

Tags: Cock fight, Sangareddy, Telangana News

తదుపరి వార్తలు