Kodandaram Comments: తెలంగాణలో కమీషన్ల కోసమే ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కృష్ణానది ప్రాజెక్టులపై వాటా కేటాయింపులు జరగకుండాఇరు రాష్ట్రాల సీఎంలు ఏం చర్చించారని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నీళ్లు రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులపై మాట్లాడదామంటే సీఎం కేసీఆర్ మాట్లడరని విమర్శించారు. కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న కోదండరాం.. పోతిరెడ్డిపాడు విస్తరణ ఆపాలని కోరారు. వచ్చే ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవడం కోసమే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.
కాళేశ్వర్యం ప్రాజెక్టు రీడిజైన్ చేయకుంటే రాష్ట్రంలోని ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తయ్యేవని కోదండరాం వ్యాఖ్యానించారు. ఉద్యమంలో సమ్మోహనంతో కేసీఆర్ వెంటనడిచామని.. తెలంగాణ వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ అందరినీ పక్కన పెట్టారని తెలిపారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అందరం కలిసి పోరాడాలని కోరారు. గట్టిగా మాట్లాడితే కోదండరాం డోర్ పగలగొడతారని.. అంతకంటే ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kodandaram, Telangana