ఖమ్మంలో టీడీపీ శంఖారావ సభను నిర్వహించడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) బీఆర్ఎస్ (BRS) పార్టీ టార్గెట్ చేసింది. ఎన్ని డ్రామాలు చేసినా.. తెలంగాణలో చంద్రబాబు ఆటవు సాగవని గులాబీదళం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలోనే ఆయన్ను నమ్మలేదని.. ఇక తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ కవిత (Kavitha) మండిపడ్డారు. ఏపీలో బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు ఎంత మంది వచ్చినా... ప్రజలు మద్దతు కేసీఆర్‌కే ఉంటుందని కవిత స్పష్టం చేశారు.
''చంద్రబాబు ఏపీని అప్పుల పాలుచేసి.. అభివృద్ధి చేయలేక..ప్రజల చీత్కారానికి గురయ్యారు. మీ పాలన బాగాలేదని ఏపీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. అలాంటిది ఇక్కడొచ్చి ఏం చేస్తారు? ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలనలో తెలంగాణ ఎక్కువగా నష్టపోయింది. యువత, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులుకు తీవ్ర అన్యాయం చేశారు. యువతను నక్సలైట్ల పేరిట కాల్చిచంపాడు. దానిని తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదు. నిరుద్యోగ యువత నోట్లో మట్టికట్టాడు. మీ మాటలపై ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. ఉదయం కోడి కూసినా.. అది నా వల్లే.. అని చెప్పే రకం. నల్గొండలో ఫ్లోరోసిస్‌ను తానే పోగొట్టానని చంద్రబాబు చెప్పడం బిగ్ జోక్. నల్గొండను ఫ్లోరైడ్ నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించింది కేసీఆరే. చంద్రబాబు హయంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి. రైతులను పిట్టల్లా కాల్చి చంపారు. వ్యవసాయం దండగ అంటే.. మా నాయకుడు దానిని పండగ చేసి చూపించారు. కేసీఆర్‌కు తెలంగాణపై ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడికి ఉంటుందా? ఆయనది సవతి తల్లి ప్రేమ. ఇదంతా మొసలి కన్నీరు. '' అని చంద్రబాబుపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. రూ.900 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
ఏపీలో బీజేపీతో పొట్టుపెట్టుకోవడం కోసమే ఈ డ్రామా ఆడుతున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు హరీష్ రావు. తన బలాన్ని చూపించుకునేందుకు ఖమ్మం సరిహద్దులో పెట్టారని.. ఆ సభకు పక్క రాష్ట్ర నుంచి జనాన్ని తీసుకొచ్చారని సెటైర్లు వేశారు. 2018 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేస్తే... చంద్రబాబు దెబ్బకు కూటమే ఖతమైపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది భస్మాసుర హస్తమని అన్నారు. ఆయన వల్ల తమకొచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్ని డ్రామాలు చేసినా.. ఆయనకు ఒరిగేదేమీ లేదని అన్నారు హరీష్ రావు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని.. ఆయన విలక్షణమైన నేత అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు ఎన్ని చేసినా.. తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
అటు కవిత కూడా చంద్రబాబునాయుడుపై సెటైర్లు వేశారు. ఎంత మంది, ఎన్ని పార్టీలు వచ్చినా... ప్రజల గుండెల్లో కేసీఆరే ఉంటారని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి కాదని విమర్శించారు.
''చుక్కలెన్ని ఉన్నా.. చందమామ ఒక్కటే. ఎన్ని పార్టీలు వచ్చినా.. తెలంగాణలో కేసీఆరే ప్రజల గుండెల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేసి టీడీపీ పునర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మరు. ఆయన తెలంగాణ శ్రేయస్సు కోరే వ్యక్తి కాదు. చంద్రబాబును గతంలోనే తిరస్కరించారు. రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంటారు.'' అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu Naidu, Harish Rao, Kalvakuntla Kavitha, Telangana