Home /News /telangana /

KNOW HOW TO DOWNLOAD NEW COLOUR VOTER ID CARD SS

Colour Voter ID Card: మీ ఓటర్ ఐడీ కార్డ్ కలర్‌లో డౌన్‌లోడ్ చేయండి ఇలా...

Colour Voter ID Card: మీ ఓటర్ ఐడీ కార్డ్ కలర్‌లో డౌన్‌లోడ్ చేయండి ఇలా...
(ప్రతీకాత్మక చిత్రం)

Colour Voter ID Card: మీ ఓటర్ ఐడీ కార్డ్ కలర్‌లో డౌన్‌లోడ్ చేయండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)

Colour Voter ID Card | కలర్ ఓటర్ ఐడీ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటున్నారా? మీ దగ్గర ఓటర్ ఐడీ కార్డ్ ఉందా? ఓటర్ ఐడీ కార్డును ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగిస్తున్నారా? మీ ఓటర్ ఐడీ కార్డును కలర్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. కొత్త ఓటర్లతో పాటు ప్రస్తుత ఓటర్లు కూడా కలర్ ఓటర్ ఐడీ కార్డు పొందొచ్చు. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ లో ఇది సాధ్యమవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 18 ఏళ్లు దాటిన పౌరులందరికీ ఓటర్ ఐడీ కార్డును అందిస్తుంది. దీన్నే ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డ్-EPIC అని కూడా ఉంటారు. సాధారణంగా ఓటర్ ఐడీ కార్డు బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కార్డుల వల్ల ఫోటోలు గుర్తించడం కష్టం అవుతుంది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కలర్ ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డ్-EPIC తీసుకునే అవకాశం కల్పిస్తోంది. కలర్ ఓటర్ ఐడీ కార్డులో కూడా ఫోటో, పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, హోలోగ్రామ్ స్టిక్కర్, యూనిక్ సీరియల్ నెంబర్, ఇష్యూయింగ్ అథారిటీ స్టాంప్డ్ సిగ్నేచర్ ఉంటాయి. ఈ కార్డు కేవలం ఓట్లు వేయడం కోసమే కాదు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇందుకోసం రూ.30 చెల్లిస్తే చాలు.

    Sabarimala Prasadam: శబరిమల అరవణ ప్రసాదం ఇంటికి తెప్పించుకోవచ్చు... ఆర్డర్ చేయండి ఇలా

    Cylinder Booking on Paytm: పేటీఎంలో సింపుల్‌గా సిలిండర్ బుకింగ్... ఎలా చేయాలంటే

    మీ రాష్ట్రానికి చెందిన ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అందులో పీవీసీ వోటర్ ఐడీ కార్డ్ లింక్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్, ఫోటో లాంటి వివరాలు ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన కోడ్ ఎంటర్ చేయండి. మీకు ఎస్ఎంఎస్ రూపంలో వివరాలు వస్తాయి. 45 నుంచి 60 రోజుల్లో ఓటర్ ఐడీ కార్డు పోస్టులో మీ ఇంటికి వస్తుంది. మీరు మీసేవా లేదా ఈసేవ కేంద్రాల్లో కూడా కలర్ ఓటర్ ఐడీ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు. రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.

    IRCTC Kerala Tour: కేరళ టూర్ ప్యాకేజీ రూ.7,425 మాత్రమే... హౌజ్ బోట్‌లో బస చేయొచ్చు

    Aadhaar Card Download: మీ ఫేస్ చూపిస్తే చాలు... ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది

    నేషనల్ వోటర్స్ సర్వీస్ పోర్టల్‌లో కూడా కలర్ ఓటర్ ఐడీ కార్డ్ తీసుకోవచ్చు. https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అందులో వోటర్ పోర్టల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతోంది. https://voterportal.eci.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫామ్ 6 పూర్తి చేయాలి. ఫోటో, కావాల్సిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Election Commission of India, GHMC Elections, Vote, Voter

    తదుపరి వార్తలు