Kisses to corona dead body : కరోనా శవానికి ముద్దులు....! వారిస్తున్న పోలీసులు

కరోనా శవానికి ముద్దులు....! వారిస్తున్న పోలీసులు

khammam : కరోనా శవానికి ముద్దులు పెడుతూ ఓ వ్యక్తి హల్‌చల్ స‌ృష్టిస్తున్నాడు. సామాజిక సృహ కోసమే తాను ఇలా చేస్తన్నానని చెబుతున్నా..ప్రభుత్వం మాత్రం ఇలా చేయడం మంచిది కాదని హెచ్చరిస్తోంది.

  • Share this:
కరోనా అంటేనే ప్రజల్లో విపరీతమైన భయం, కనీసం కుటుంబసభ్యులు కూడ కరోనా పేషంట్లకు సహయం చేయడం కోసం ముందుకు రాని వ్యవస్థ ఏర్పడింది. ఇక కరోనాతో చనిపోయాడంటే అంతే సంగతులు దగ్గరి మిత్రులు, కుటుంబ సభ్యులు కూడ చివరి చూపు చూడని దయనీయ పరిస్థితి కరోనా తీసుకువచ్చింది.

ఇలా కరోనా సోకిన వ్యక్తి నుండి మరోకరికి అంటువ్యాధిలా ప్రబలుతోంది. దీంతో ప్రజల మధ్య సంబంధాలు కట్ చేసేందుకు దేశంలోని సగం రాష్ట్రాలు లాక్డౌన్‌ను విధించాయి. కరోనాతో సహజీవనం చేయాలని ప్రభుత్వాలు చెబుతున్నా గ్రౌండ్‌లో లెవల్‌లో ఆ పరిస్థితి లేదు.. కరోనా అంటేనే అదేదో భూతం, దయ్యం కంటే ఎక్కువగా జనాలు ఫీల్ అవుతున్నారు. దీంతో కరోనా సోకిన వ్యక్తిని తమ ఇంటి చాయలకు కూడ రాకుండా వ్యవహరిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ నిబంధలు కూడ ఉన్నాయి.మనిషి చనిపోతే కేవలం 20 మందికే అంత్యక్రియలకు అనుమతి ఇస్తున్నారు.

అయితే మరోవైపు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు , ముఖ్యంగా వైద్యులు ఇవన్ని భరించి విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లు వేసుకుని కరోనా రోగులకు చికిత్స అందిస్తుండగా...కరోనా మృతుల ఖననం కూడ పీపీఈ కిట్లతోనే సాగుతోంది.అయినా వాళ్లలో కూడ వేల సంఖ్యలో దేశవ్యాప్తంగా మృత్యువాత పడుతున్నారు..దీంతో ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా.. కరోనా అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడికి సగటు మనిషి గురవుతున్నారు.

అయితే ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ నిర్వహిస్తున్న శ్రీనివాస రావు ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. సామాజిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కరోనా శవాలకు దహాన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా ప్రజల్లో ధైర్యం కల్పించేందుకు ఏకంగా కరోనా మృతదేహాలకు ముద్దులు పెడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరి ఇంతా చేస్తున్నా ఆయనకు కరోనా సోకుతుందా అంటే.. కరోనా ఆయన దరిదాపులకు కూడ రావడం లేదు..దీంతో ఆయన కరోనా శవాలకు ముద్దులు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇది సామాజికంగా హర్షించే విషయమే అయినా..డాక్టర్లు, నిపుణులు ,ప్రభుత్వ వ్యవస్థలతో పాటు పెద్ద ఎత్తున అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి..కరోనా శవం వద్దకు వెళితేనే తమకు కరోనా వస్తుందనే అభిప్రాయంతో ఉన్నవారికి ఈ వీడియో కొంత ఊరట కల్గించినా.. సైంటిఫిక్‌గా మాత్రం దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇక శ్రీనివాసరావు ఫౌండేషన్ పై అప్పుడే స్థానిక పోలీసులు ఓ ప్రకటన కూడ విడుదల చేశారు. కరోనా శవాలకు ముద్దులు పెడుతున్న శ్రీనివాస రావుకు రోగ నిరోధక శక్తి ఎక్కవగా ఉండడం వల్ల కరోనా దరి చేరడం లేదని ..అయితే చట్టం ప్రకారం ఇలాంటీ వాటికి అనుమతి లేదని పోలీసులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు. కొవిడ్ శవాలకు తీసుకుంటున్న నిబంధనలను మరోసారి మీడియాకు విడుదల చేశారు.
Published by:yveerash yveerash
First published: