ఇదేం పద్ధతి... మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి అసంతృప్తి

పార్లమెంట్ నడుస్తుంటే ప్రారంభ కార్యక్రమాన్ని ఎలా పెట్టుకుంటారన్న బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

news18-telugu
Updated: February 14, 2020, 4:50 PM IST
ఇదేం పద్ధతి... మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి అసంతృప్తి
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
హైదరాబాద్ మెట్రో రైల్ ఉన్నతాధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదని బీజేపీ నేతలు చెబుతున్నరు. పార్లమెంట్ నడుస్తుంటే ప్రారంభ కార్యక్రమాన్ని ఎలా పెట్టుకుంటారన్న బీజేపీ నేతలు వాదిస్తున్నారు. రేపు దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో మెట్రో అధికారులతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాంచందర్‌రావు ప్రయాణించనున్నారు. మెట్రో నిర్మాణంలో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని చెప్పేందుకే బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం జూబ్లి బస్టాండ్ - మహాత్మాగాంధీ బస్టాండ్ మధ్య నిర్మించిన మెట్రో కారిడార్‌ అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ మెట్రో రైల్ కారిడార్‌ను ప్రారంభించారు. పచ్చ జెండా ఊపిన సీఎం కేసీఆర్ రైలును ప్రారంభించారు. ఈ మార్గం మొత్తం 11 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ చేరుకుంటుంది. 16 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోనే అతి పెద్ద రెండో మెట్రోగా ఆవిర్భవించనుంది. అయితే ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించకపోవడంపై బీజేపీ అసంతృప్తితో ఉంది.
Published by: Kishore Akkaladevi
First published: February 14, 2020, 4:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading