హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆన్‌లైన్‌లోనే తల్లి ప్రథమ వర్థంతి చేయనున్న కేంద్రమంత్రి.. ఆయనెవరో తెలుసా..

ఆన్‌లైన్‌లోనే తల్లి ప్రథమ వర్థంతి చేయనున్న కేంద్రమంత్రి.. ఆయనెవరో తెలుసా..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (File)

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (File)

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉండడం.. లాక్‌డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి రాలేకపోతున్నారు. దీంతో తోబుట్టువులు తిమ్మాపూర్‌లో, కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసం నుంచి ఆన్‌లైన్ ద్వారా తన తల్లి వర్థంతిని శాస్త్రోక్తంగా చేయనున్నారు.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దేశపౌరులంతా లాక్‌డౌన్‌కు కట్టుబడి ఉండడంతో తాను అందుకు అతీతుడను కాదని నిరూపించాడు ఓ కేంద్రంమంత్రి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తల్లి అండాలమ్మ ప్రథమ వర్థంతిని సోమవారం తన స్వగామ్రం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో చేయాల్సి ఉంది. కానీ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉండడం.. లాక్‌డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి రాలేకపోతున్నారు. దీంతో తోబుట్టువులు తిమ్మాపూర్‌లో, కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసం నుంచి ఆన్‌లైన్ ద్వారా తన తల్లి వర్థంతిని శాస్త్రోక్తంగా చేయనున్నారు.

First published:

Tags: Hyderabad, Kishan Reddy, Rangareddy, Union Home Ministry

ఉత్తమ కథలు