కరీంనగర్ జిల్లాలో కిరాణ షాపుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి లో కిరాణ షాపుల వారికి కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్ జిల్లా కిరాణ, వర్తక సంఘం మెజారిటీ షాపుల యజమానుల అంగీకారం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 (సోమవారం) నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు తరువాత షాపులు తెరిచి ఉంచే వారిపై రూ.5000 జరిమానా కూడా విధించాలని కూడా నిర్ణయించారు. సోమవారం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే కిరాణం షాపులు తెరిచి ఉంటాయని కిరాణ వర్తక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలగందుల మునీందర్ తెలిపారు.
తెలంగాణలో నిన్న 499 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ ఎంసీ పరిధిలో 329 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 129, జనగాంలో 7, మహబూబ్ నగర్లొో 6, మేడ్చల్, మంచిర్యాల, నల్గొండ, నిజామాబాద్‌లో 4 చొప్పున, ఖమ్మం, సూర్యాపేటలో 2 చొప్పున, సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ఒక్కో కేసులు బయటపడ్డాయి.
తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6525 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3352 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..198 మంది మరణించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 2976 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్టుల విషయానికి వస్తే శుక్రవారం రాష్ట్రంలో 2477 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 1978 నెగెటివ్ రాగా.. 499 పాజిటివ్ వచ్చాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 50, 569 కరోనా టెస్ట్‌ల నిర్వహించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Lockdown, Telangana