పన్నెండు మెట్ల కిన్నెర గాయని బాలమ్మ కన్నుమూత

15ఏళ్ల వయసు నుంచే బాలమ్మ కిన్నెర వాయిస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్త మరణం తర్వాత కూడా ఆమె తన కళను విడిచిపెట్టలేదు.

news18-telugu
Updated: December 9, 2018, 12:45 PM IST
పన్నెండు మెట్ల కిన్నెర గాయని బాలమ్మ కన్నుమూత
కిన్నెర గాయని బాలమ్మ(File)
news18-telugu
Updated: December 9, 2018, 12:45 PM IST
పన్నెండు మెట్ల కిన్నెర గాయని బాలమ్మ(90) కన్నుమూశారు. తెలంగాణలో ఉన్న చివరి డక్కలి కిన్నెర గాయనిగా ఆమె ప్రసిద్ది చెందారు. వికారాబార్ జిల్లా తాండూరు మండలం మంబాపూర్ గ్రామంలో ఆమె తుది శ్వాస విడిచారు.

15ఏళ్ల వయసు నుంచే బాలమ్మ కిన్నెర వాయిస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్త మరణం తర్వాత కూడా ఆమె తన కళను విడిచిపెట్టలేదు. ఊరురూ తిరుగుతూ కిన్నెరపై వీరగాథలు గానం చేసేవారు. దాదాపు 10 వీరగాథలు కిన్నెరపై ఆమె అలవోకగా పలికించగలరు. అయితే ఆమె కళా ప్రతిభను ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో.. జీవితాంతం ఆమెను పేదరికం వెంటాడింది.

ఆఖరికి సొంత ఇల్లు కాదు కదా, తెల్ల రేషన్ కార్డు కూడా ప్రభుత్వం నుంచి ఆమెకు అందలేదు. వయసు మీద పడటంతో మంచానికే పరిమితమైన బాలమ్మ.. అనారోగ్యం ఎక్కువవడంతో ఆదివారం కన్నుమూశారు. బాలమ్మ మృతికి తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు సంతాపం వ్యక్తం చేశారు.

First published: December 9, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...