నన్నూ అక్కడే చంపెయ్యండి : దిశ కేసులో నిందితుడి భార్య ఆవేదన

Disha Case Encounter : ఓవైపు దిశ హత్యాచారం కేసులో ఓ యువతికి జరిగిన అన్యాయానికి ఎన్‌కౌంటర్ ద్వారా న్యాయం జరిగిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తుంటే... మరోవైపు తమకు అన్యాయం జరిగిందని నిందితుల తరపు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: December 6, 2019, 12:46 PM IST
నన్నూ అక్కడే చంపెయ్యండి : దిశ కేసులో నిందితుడి భార్య ఆవేదన
Video : నన్నూ అక్కడే చంపెయ్యండి : దిశ కేసులో నిందితుడి భార్య ఆవేదన
  • Share this:
Disha Case Encounter : దిశ హత్యా, అత్యాచారం కేసులో నిందితులకు ఉరిశిక్ష వెయ్యాలని అంతా కోరుకున్నారు. ఐతే... ఎన్‌కౌంటర్‌లో వాళ్లు చనిపోవడంతో... వెంటనే ఆమెకు న్యాయం జరిగిందనీ, తక్షణం శిక్ష పడిందని అంతా అంటున్నారు. ఐతే... ఇక్కడ మరో కోణంలో విషాదం కూడా కనిపిస్తోంది. దిశకు తగిన న్యాయం జరుగిందని అంతా భావిస్తున్న తరుణంలో తన భర్త (నిందితుడు చెన్నకేశవులు)ను అన్యాయంగా చంపేశారని... అతని భార్య వెక్కివెక్కి ఏడుస్తోంది. తనకు పెళ్లై ఏడాది కూడా కాలేదనీ, భర్త లేకుండా తాను బతకలేనన్న ఆమె... తనను కూడా అదే స్పాట్‌కి తీసుకెళ్లి చంపేయమని కోరుకోవడం అందరి హృదయాల్నీ కదిలిస్తోంది. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నప్పుడు... తిరిగి పంపిస్తామని మాట ఇచ్చారన్న ఆమె... తీరా తీసుకెళ్లి చంపేశారని కన్నీళ్లు పెడుతున్నారు. తన భర్త లేకుండా తను బతకనన్న ఆమె... చనిపోతానని చెబుతుండటం అందర్నీ విచారంలో పడేసింది. ఇటు దిశకు న్యాయం జరిగిందని ఆనందపడాలో, లేక అటు నిందితుల కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారని బాధపడాలో అర్థంకాని పరిస్థితి తలెత్తుతోంది. కానీ... చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందేనంటున్న ప్రజలు... ఆమెను ఓదార్చుతున్నారు.

Pics : అందం, అభినయానికి కేరాఫ్ విద్యా ప్రదీప్
ఇవి కూడా చదవండి :ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వాన్ని రిపోర్ట్ కోరిన కేంద్రం

సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ... ఎక్కడో తెలుసా?తెలంగాణ ఏర్పడ్డాక మూడు సంచలన ఎన్‌కౌంటర్లు...

సాహో సజ్జనార్... ఆకాశానికెత్తేస్తున్న నెటిజన్లు


ఆ విషయంలో రోజా విన్నర్... నాగబాబు ఫెయిల్?
First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>