రోగులకు అంబులెన్స్ సేవలు వర్ణించలేనివి..చికిత్సకు వైద్యులు ఎంత అవసరమో..ఆపదలో ఉన్నవారిని అత్యవసర చికిత్స అవసరమున్నవారిని సమాయానికి ఆసుపత్రులకు చేర్చడం కూడా అంతే ముఖ్యం..ఈ నేపథ్యంలోనే అంబులెన్స్‌లో రోగి చేరినప్పటి నుండి వారిన ఆస్పత్రికి చేరుకునే వరకు జాగ్రత్తగా ఎలాంటీ ప్రమాదం రాకుండాతీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటీ సంధర్బాల్లో మార్గమధ్యలో రోగులకు ఏదైనా జరిగితే..చాలా ధైర్యం చేస్తారు..వారే ముందుకు వచ్చి ప్రాణాలను కాపాడతారు. ఇలా ఎంతో మందికి ప్రాణం పోసిన అంబులెన్స్ సిబ్బంది తాజాగా మరో ఆగిపోయిన గుండెకు ప్రాణం పోసి పసిప్రాణాన్ని నిలబెట్టారు.
కరీంనగర్ జిల్లా మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు.అయితే బాబుకు అనారోగ్యం కారణంగా కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా, బాబు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు.
వైద్యుల సలహాతో అత్యవసర పరిస్థితిలో ఉన్న తమ బాలుడిని తల్లిదండ్రులు వరంగల్‌కు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అయితే, అంబులెన్స్‌లో ప్రయాణిస్తుండగా.. పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే.. హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambulence, Free ambulance