Home /News /telangana /

Kharitabad Ganesh immersion : మొదలైన ఖైరతాబాద్‌ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు .. ఈ సారి బాలాపూర్ లడ్డు వేలం ఎంతో మరి..

Kharitabad Ganesh immersion : మొదలైన ఖైరతాబాద్‌ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు .. ఈ సారి బాలాపూర్ లడ్డు వేలం ఎంతో మరి..

Kharitabad Ganesh immersion

Kharitabad Ganesh immersion

Kharitabad Ganesh immersion : ఖైరతాబాద్‌లో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జన ఘట్టం శుక్రవారం అర్థరాత్రి నుండే మొదలు పెట్టనున్నారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో అంతకు ముందు సంవత్సరం లాగానే ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ముందస్తుగా నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించనుంది.

ఇంకా చదవండి ...
    గణేశ్ శోభాయాత్రకు ఏర్పాట్లు

    హైదరాబాద్‌కు(Hyderabad) తలమానికమైన ఖైరాతాబాద్ గణేశ్‌ నిమజ్జనం (khairatbad ganesh )ఆదివారం జరుగునుండగా గణపతి విగ్రహాన్ని తీసుకెళ్లే ట్రాలీని సిద్ధం ఇప్పటికే సిద్ధం చేశారు. విగ్రహాన్ని(ganesh idol) దానిపై అమర్చేందుకు అనువుగా ఉండేందుకు ఐరన్‌ రాడ్స్‍కు వెల్డింగ్‌ పనులు చేపట్టారు. గణేశుడిపై ఉన్న షెడ్ల తొలగింపు పనులు సైతం ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఈ రోజు ఉదయం కర్రలను తొలగించారు. కాగా శనివారం 12గంటల తర్వాత ట్రాలీ, భారీ క్రేన్‌ గణేష్ మండపానికి చేరుకుంటాయి. ఆ తర్వాత గణపతి ముందు ఉన్న కలశాన్ని కదిలిస్తారు.

    ఆదివారం ఉదయమే శోభాయాత్ర

    ఆదివారం ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య ప్రత్యేక పూజలు చేసి.. అనంతరం ఉదయం 6గంటలకు విగ్రహాన్ని ట్రాలీ మీదకు ప్రత్యేక క్రేన్ ద్వారా తీసుకువస్తారు.. తర్వాత ఊరేగింపు కోసం రెండు గంటల పాటు ట్రాలీపై విగ్రహానికి వెల్డింగ్‌ ప్రారంభించి... అనంతరం ట్రాలీని అలంకరిస్తారు. ఆ తర్వాత సుమారు ఉదయం 9 గంటల ప్రాంతంలో గణేశుడి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. శోభాయాత్ర ఖైరతాబాద్, లక్డీకపూల్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్క నుండి ట్యాంక్‌బండ్ చేరుకుంటుంది. ఇలా.. మధ్యాహ్నం 12గంటలకు శోభాయాత్ర కొనసాగిన అనంతరం నిమజ్జనం చేసేందుకు 5 నంబర్ క్రేన్ వద్దకు చేరుస్తారు. గణేశుడి వద్ద ఉంచిన కలశాన్ని గంగలో కలిపిన తర్వాత నిమజ్జన ఘట్టం పూర్తవుతుంది.కాగా ఈ మొత్తం కార్యక్రమం పూర్తి అయ్యో సరికి మధ్యాహ్నం 3నుంచి 3.30గంటల మధ్య గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు.

    ఇది చదవండి : రేపే.. గణేష్ నిమజ్జనం అంతా సిధ్దం .. 320 కి.మీ.ల పొడవునా గణేశ్ శోభాయాత్ర


    బాలాపూర్ లడ్డు వేలం

    మరోవైపు నగరంలో ఉన్న వినాయక మండపాల వద్ద లడ్డుల వేలం కొనసాగనుంది. ముఖ్యంగా నగరంలోని బాలాపూర్ లడ్డు వేలంపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తారు.. ఉదయం ఎనిమిది గంటలకు వేలం పాట మొదలైన అనంతరం బాలపూర్ వినాయకుని శోభాయాత్ర ప్రారంభమవుతుంది.

    ఇది చదవండి : హైదరాబాద్‌లో మందు బాబులకు తిప్పలే.. రెండు రోజులు మద్యం బంద్..


    గత సంవత్సరం 17.60 లక్షలు

    కాగా గత సంవత్సరం కోవిడ్ కారణంగా బాలాపూర్(Balapur) లడ్డు వేలానికి వేయలేదు. ఈ క్రమంలోనే లడ్డును సీఎం కేసీఆర్‌కు(cm kcr) నిర్వాహకులు అందించారు. అయితే ఈసారి కోవిడ్ నిబంధనలు సడలించడంతో మరోసారి పెద్ద ఎత్తున లడ్డు వేలంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.. బాలాపూర్ వేలం ముందుగా 1994 సంవత్సరంలో నిర్వహించగా కేవలం 450 రూపాయలు పలికింది. అలా ప్రతి సంవత్సరం వేలం పాట లక్షల్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే 2019 సంవత్సరంలో 17.60 లక్షల రూపాయలు లడ్డు వేలం పలికింది.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Ganesh immersion, Hyderabad, Khairatabad ganesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు