Home /News /telangana /

KHANAPUR MLA REKHA NAIK TESTED COVID POSITIVE VB ADB

MLA Rekha Naik: ఖానాపూర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే

రేఖానాయక్ (ఫైల్)

రేఖానాయక్ (ఫైల్)

MLA Rekha Naik: నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఎమ్మెల్యే కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

    కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో ప్రతీ ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రాగా క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.  ఇప్పటి వరకు కరోనా గిరిజన ప్రాంతాలకు కరోనా పాకలేదు. అయితే తొలిసారిగా గిరిజన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌ సోకగా ఆమె వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురికావొద్దని ఆమె పేర్కొన్నారు. గత ఐదు రోజుల నుండి తనతో కాంటాక్ట్ అయినవారికీ లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్టు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Adilabad, Corona, Corona cases, Corona positive, Covid-19, Khanapur MLA, Nirmal, Rekha naik

    తదుపరి వార్తలు