హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: కేసీఆర్​ కుటుంబానికి మాత్రం 5 ఉద్యోగాలు కావాలి.. తెలంగాణ బిడ్డలేమో హమాలీ పనికి పోవాలా? షర్మిలా ధ్వజం

YS Sharmila: కేసీఆర్​ కుటుంబానికి మాత్రం 5 ఉద్యోగాలు కావాలి.. తెలంగాణ బిడ్డలేమో హమాలీ పనికి పోవాలా? షర్మిలా ధ్వజం

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​పై వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిలా ధ్వజమెత్తారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం రైతులను అన్నిరకాలుగా మోసం చేసిందని ఆరోపించారు. విత్తనాలు, ఎరువుల మీద సబ్సీడీలు లేవని ధ్వజమెత్తారు షర్మిలా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR)​పై వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిలా (YSRTP president YS Sharmila) ధ్వజమెత్తారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం (TRS government) రైతులను అన్నిరకాలుగా మోసం చేసిందని ఆరోపించారు. విత్తనాలు, ఎరువుల మీద సబ్సీడీలు లేవని ధ్వజమెత్తారు షర్మిలా. ఈ మేరకు ఖమ్మంలోని (Khammam) సత్తుపల్లి నియోజక వర్గంలో షర్మిలా మాట్లాడుతూ.. ‘‘రైతులను బ్యాంక్ ల దగ్గర డీ ఫాల్టర్లు గా మిగిల్చారు. బ్యాంక్ వాళ్ళు రైతులను (Farmers) దొంగలు గా చూస్తున్నారు. రైతుల ఇల్లు జప్తు చేస్తున్నారు. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలుచేసుకున్నారు . రైతుల ఆత్మహత్యల (farmers Suicide) పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే. వైఎస్సార్ (YSR) హయాంలో వ్యవసాయం లాభసాటి గా ఉండేది. ముష్టి 5 వేలు ఇస్తే రైతులు కోటేశ్వర్లు అయిపోతారా..? 5 వేలు ఇస్తేనే రైతులు కార్లలో తిరుగుతారా?. 25 వేలు ఇచ్చే పథకాలు బంద్ పెట్టీ 5 వేలు ఇస్తూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. విత్తనాల సబ్సిడీ లేదు.. ఎరువుల మీద సబ్సిడీ లేదు.

రైతులకు బరోసా గా ఉంటే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు .60 ఏళ్లు దాటితే నే భీమా అని రైతు నుదుటి మీద మరణ శాసనం రాస్తున్నారు. రైతును ఏ విధంగా ఆదుకోవడం లేదు. రైతును అన్ని రకాలుగా మోసం (Cheat)చేశారు. టీఆరెఎస్ అధికారం లోకి వచ్చిన 8 ఏళ్లలో ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరిగిందో చెప్పాలి. చివరికి పెన్షన్లు (Pensions) కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం అవసరమా?. కేసీఆర్ (KCR) మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకం.

ఉద్యమ కారుడు కదా అని రెండు సార్లు అధికారం ఇస్తే నెత్తిన టోపీ పెట్టాడు ఎన్నికలు వస్తున్నాయి..మళ్ళీ వస్తాడు. ఈ సారి బీసీ బందు అంటారు.. ఎస్టీ బందు అంటారు. రాష్ట్రం మీద కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పులు చేశారు. కేసీఆర్ కుటుంబం (KCR Family) మాత్రమే తెలంగాణ (Telangana)లో బాగుపడింది. కేసీఆర్ కుటుంబం లో 5 ఉద్యోగాలు కావాలి.. మీ బిడ్డలు మాత్రం హమాలీ పనులకు పోవాలా? పరిపాలన చేతకాక పోతే అధికారం లో ఉండి ఎం లాభం”అని షర్మిల ధ్వజమెత్తారు.

‘‘వైఎస్సార్ (YSR) సంక్షేమ పాలన కోసమే పార్టీ పెట్టాను. నమ్మకంగా సేవ చేస్తా అని మాట ఇస్తున్న వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. రైతును రారాజు చేస్తా.. భారీగా ఉద్యోగాలు ఇస్తాం. ఫీజ్ రియంబర్స్ మెంట్...ఆరోగ్యశ్రీ (Arogyasri)పథకాలు అమలు. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్లు”అని షర్మిల హామీ ఇచ్చారు.

కాగా, అంతకుముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC chief Revanth Reddy) ఒక దొంగ అని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని  వైఎస్ షర్మిల (YS Sharmila )మండిపడ్డారు. అంతేకాకుండా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలను విమర్శించారు. రెడ్డి సమాజానికి అధికారం ఇవ్వాలని, ఇతర కులాలు నాయకత్వానికి పనికి రావని మాట్లాడటం ఆక్షేపనీయం అని షర్మిలా అన్నారు. రేవంత్ రెడ్డి ఇలా బరితెగించి మాట్లాడుతూ అధిష్టానం కనీసం చర్యలు కూడా తీసుకోలేదని ఆమె మండిపడ్డారు. సస్పెండ్ చేయలేదని, కనీసం మందలించలేదని అన్నారు.

First published:

Tags: CM KCR, Farmers, Khammam, Telangana Politics, YS Sharmila, Ysrtp

ఉత్తమ కథలు